ప్రస్తుతం రోజా ని జబర్దస్త్ కమెడియన్స్ లో చాలామంది తెగ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కిర్రాక్ ఆర్పీ అయితే రోజ ని చెడా మడా ఏసుకుంటున్నాడు. రోజా డైమండ్ రాణి అంటూ చాలా చీప్ గా మాట్లాడుతున్నాడు. అటు హైపర్ ఆది ఇలా చాలామంది జబర్దస్త్ కండియన్స్ రోజా ని మాములుగా ఆడుకోవడం లేదు. కారణం లేకపోలేదు.. మెగా హీరోలకి భయపడి జబర్డస్త్ లో కామెడీ చేసుకునేవారంతా జనసేనకు జై కొట్టారంటూ రోజా కూడా కమెడియన్స్ పై కామెంట్స్ చేసింది.
అయితే ఇప్పుడు కమెడియన్స్ జనసేన తరపున ప్రచారం చేసిన వారంతా 2024 ఎన్నికల్లో గెలవడం, రోజా ఓడిపోవడంతో ఆమె కామ్ అవ్వగా, కమెడియన్స్ కూడా ఎవరికీ వారు తమ తమ పనులు చేసుకుంటున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాజేష్.. జబర్దస్త్ లో ఉన్నప్పుడు రోజా వలన చాలామంది లాభపడ్డారు. అందరూ ఆవిడ కాళ్ళ మీద పడినవారే, ఒంగి ఒంగి నమస్కారాలు చేసారు. ఆవిడ అందరికి సాయం చేసింది.
కానీ రాజకీయాలకొచ్చేసరికి అందరూ రోజా గారికి యాంటీ అయ్యారు. రోజా గారిని అన్నన్ని మాటలనాల్సిన అవసరం లేదు, ఆవిడ వలన జబర్దస్త్ లో లాభపడిన వారే ఎక్కువగా ఉన్నారు. ఎవ్వరు ఏది మొదలు పెట్టినా రోజా గారు వెళ్లి వాళ్ళని ఆ శీర్వదించేవారు. ఆర్పీ కూడా నెల్లూరు చేపల పులుసు ఓపెనింగ్ కి ఆవిడని పిలిచాడు అంటూ రోజా vs జబర్దస్త్ కమెడియన్స్ పై రాకింగ్ రాజేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.