ప్రస్తుతం సోషల్ మీడియా చూసినా, ఏ మీడియా చూసినా అంతా కల్కి నామ జపమే నడుస్తుంది. అభిమానులు కల్కి 2898 AD తో ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు, కల్కి టికెట్ల గురించి గొడవ పడుతున్నారు. మరోపక్క కల్కి మేకర్స్ ఈ దేశంలో కల్కి బుకింగ్స్ ఇలా ఉన్నాయి, ఆ దేశంలో ఆ సినిమాని కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ బ్రేక్ చేసాయి అంటూ పోస్టర్స్ వదులుతున్నారు.
ఎక్కడ చూసినా ఏ నోట విన్నా కల్కి గురించిన మాటలే, కల్కి గురించిన ముచ్చట్లే. ప్రభాస్, కమల్ హసన్, అమితాబచ్చన్, దీపికా, గెస్ట్ రోల్స్ చేస్తున్న తారలు పై కల్కి రెండు ట్రైలర్స్ తోనే ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఓ అంచనాకు వచ్చేసారు. ఇక సినిమా కథ ఎలా ఉంటుందో అనేది ట్రైలర్స్ రెండిటిలో రివీల్ అవ్వకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.
దానితో కల్కి 2898 AD కథ పై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది.. అందుకే కల్కి బుకింగ్స్ ఓపెన్ కాగానే టికెట్లు బుక్ చేసుకోవడానికి అభిమానులు ఆరాటపడిపోయారు. కొంతమంది స్పెషల్ షోస్ గురించి ఏ వార్త తెలుస్తుందా.. ఎంతయినా పెట్టి కల్కి టికెట్ కొనెయ్యాలని, అందరికన్నా ముందే సినిమా చూసెయ్యాలని ఆత్రం చూపిస్తున్నారు.
ఇలా ఎక్కడ, ఎటు చూసినా కూడా కల్కి మాయే కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోయే కల్కి కోసం పాన్ ఇండియా ప్రేక్షకుల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ వరకు ఎంతగా ఎదురు చూస్తున్నారో అనేది ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి తెలుస్తోంది.