Advertisementt

ఇండియన్ 2 ట్రైలర్: ఆట మొదలైంది

Tue 25th Jun 2024 07:51 PM
indian 2  ఇండియన్ 2 ట్రైలర్: ఆట మొదలైంది
Indian 2 Trailer Review ఇండియన్ 2 ట్రైలర్: ఆట మొదలైంది
Advertisement
Ads by CJ

 

కమల్ హాసన్ హీరోగా టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 ( భారతీయుడు 2) చిత్రం జులై 12 న విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కించిన ఇండియన్ 2 పై ట్రేడ్ లోనే కాదు కమల్ అభిమానుల్లో, పాన్ ఇండియా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‍గా ఈ మూవీ వస్తోంది. అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్ హాసన్ కేరెక్టర్ లోని వేరియేషన్స్ కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం.  

భారతీయుడు 2 ట్రైలర్ లోకి వెళితే.. ఊరారా ఇది, చదువుకు తగ్గ జాబ్ లేదు, జాబ్‍కు తగ్గ జీతం లేదు, కట్టిన పన్నుకు తగ్గట్టు సదుపాయాలు దొరకడం లేదు, దొంగలించే వాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసే వాడు తప్పు చేస్తూనే ఉంటాడు అనే వాయిస్ ఓవర్‌తో అసలు దేశంలోని ప్రస్తుత పరిస్థితులని చూపిస్తూ ట్రైలర్ మొదలైంది. అవినీతిని అంతం చెయ్యాలంటే సేనాపతి రావాల్సిందే అంటూ యూత్ మొత్తం సేనాపతి కోసం సోషల్ మీడియా క్యాపెయినింగ్ నిర్వహిస్తుంది. సిద్దార్థ్ యూత్ ని వెంటబెట్టుకుని అన్యాయాలను అరికట్టాలంటూ ధర్నాలు చేస్తూ వీళ్లందరినీ చీల్చి చెండాడే హంటింగ్ డాగ్ రావాలి అంటూ ఆవేశంతో అంటాడు. 

ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను అంటూ కమల్ ఎంట్రీ అదిరిపోయింది. టామ్ అండ్ జెర్రీ ఆట మొదలైంది. మీయామ్ అంటూ కమల్ హాసన్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కి ఫిదా అవ్వాల్సిందే. సింగిల్ వీల్ స్కూటర్‌పై కమల్ కనిపించగానే థియేటర్స్ లో విజిల్స్ పడతాయనడంలో సందేహం లేదు. సేనాపతిగా పలు గెటప్స్‌తో కమల్ చేసిన యాక్షన్ కి గూస్ బంప్స్ రావాల్సిందే. ఇండియన్ 2 లో ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో డిఫ్రెంట్ గా కనిపించాడు. 

మొత్తానికి ఇండియన్ 2 ట్రైలర్ ఆకలితో ఉన్న కమల్ అభిమానులకి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. శంకర్ అదిరిపోయే మేకింగ్ స్టయిల్, లైకా ప్రొడక్షన్ వారి రిచ్ నెస్ ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తోంది. 

Indian 2 Trailer Review:

Indian 2 Trailer Out

Tags:   INDIAN 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ