Advertisementt

నార్త్ లో ప్రభాస్ జోరు

Tue 25th Jun 2024 05:50 PM
prabhas  నార్త్ లో ప్రభాస్ జోరు
Prabhas Joru in North నార్త్ లో ప్రభాస్ జోరు
Advertisement
Ads by CJ

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ క్రేజ్ నార్త్ ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగిపోయింది. బాహుబలిగా ప్రభాస్ ని నార్త్ ఆడియన్స్ ఆరాధించేసారు. ఆ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలకి నార్త్ ఆడియన్స్ భారీ ఓపెనింగ్స్ కట్టబెట్టారు. ఆ సినిమాలు సౌత్ లో ఆడకపోయినా నార్త్ లో పర్వాలేదనిపించాయి. 

సలార్ తో మరోసారి హిందీ బాక్సాఫీసుని చెల్లాచెదురు చేసాడు ప్రభాస్. ఇక ఇప్పుడు ప్రభాస్ నుంచి రాబోతున్న కల్కి 2898 AD పై అక్కడ నార్త్ లో విపరీతమైన క్రేజ్ మొదలైంది. కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే హిందీ మార్కెట్ లో 25 కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే మాట ట్రేడ్ వర్గాల ద్వారా అందుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ చిత్రం 20 కోట్ల క్లబ్బుకు చేరువయ్యేలా ఉంది. 

కల్కి ముంబై ప్రెస్ మీట్ తర్వాత అక్కడి ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ పెరగబట్టే ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కనిపిస్తుంది అంటున్నారు. దీపికా పదుకొనే, అమితాబచ్చన్ ల క్రేజ్ కూడా కల్కి హిందీ బుకింగ్స్ కి హెల్ప్ అయ్యింది. కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరోలు చాలా తక్కువ మంది ఈ రేర్ ఫీట్ ని సాధించారు. లైక్ షారుఖ్ జవాన్, పఠాన్ మినహాయిస్తే చాలా రోజులుగా ఏ హీరో కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ కొల్లగొట్టలేదు అనే చెప్పాలి. దీనిని బట్టి ప్రభాస్ పై నార్త్ ఆడియన్స్ కి ఎన్ని అంచనాలున్నాయో అర్ధమైపోతుంది. 

Prabhas Joru in North:

Prabhas craze in North

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ