గత ఐదేళ్లుగా తానొక్కడే వైసీపీ పార్టీకి అధినేత, ప్రజలకి సీఎం, మంత్రి, ఎమ్యెల్యే అని మిగతా వారిని లెక్క చెయ్యకుండా, అభివృద్ధిని గాలికొదిలేసి.. పథకాలు అమలు చేస్తూ అదే నా ఓటు బ్యాంక్, నా మంచే నన్ను గెలిపిస్తుంది అని వైసీపీ కేడర్ ని పట్టించుకోని జగన్ మోహన్ రెడ్డి.. తన బూతు మంత్రులని కంట్రోల్ చెయ్యకుండా విచ్చలవిడిగా వదిలేసి.. ప్రజల్లో కావాల్సినంత చెడ్డ పేరుతొ పాటుగా.. సొంత పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి బలి అయ్యాడు.
వై నాట్ 175 అంటూ ధీమా చూపిస్తూ.. ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరంటూ ప్రగల్బాలు పలికిన జగన్ నేడు ప్రతిపక్ష హోదా కోసం వేడుకునే స్థితికి వచ్చారు. జగన్ కి 2024 ఎన్నికల్లో ప్రతి పక్ష హోదా కూడా లేకుండా కేవలం అంటే కేవలం 11 సీట్లకే ఏపీ ప్రజలు పరిమితం చేశారు. కూటమి కట్టినా.. టీడీపీ కి ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లని ప్రజలు ఇచ్చినా.. మిత్ర పక్షంతో బరిలోకి దిగిన జనసేనతో టీడీపీ స్నేహ బంధాన్ని కొనసాగిస్తుంది. అదే జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో గెలిచింది. దానితో టీడీపీ తర్వాత అసంబ్లీలో జనసేన ప్రతిపక్ష హోదా తీసుకోవాల్సి వచ్చింది.
కానీ జగన్ మోహన్ రెడ్డి తనకి ప్రతి పక్ష హోదా ఇవ్వడం లేదు అంటూ గగ్గోలు పెడుతున్నాడు. తనకి స్పీకర్ సముచిత స్థానం ఇవ్వాలని, మంత్రుల తర్వాత తనని ప్రమాణ స్వీకారం చేయమనడం చట్ట విరుద్దమంటూ అసంబ్లీ స్పీకర్ కి ఓపెన్ లెటర్ రాసాడు.
మంత్రుల తర్వాత నాతో ప్రమాణస్వీకారం పద్దతులకు విరుద్ధం, ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు, విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు.
పార్లమెంటులో కాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకాని ఈ నిబంధన పాటించలేదు, అధికారకూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వానికి ప్రదర్శిస్తున్నారు, చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదు, ప్రతిపక్ష హోదాతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నాను.. అంటూ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ కి లేఖ రాసాడు.