పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది ఏదో ఒక దీక్ష చేస్తూ ఉంటారు.. లైక్ చాతుర్మాస దీక్ష, లేదంటే అమ్మవారి దీక్ష ఇలా ఏదో ఒక దీక్ష తీసుకుని కఠిన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. కింద పడుకోవడం, ఆహారంగా పాలు, పళ్ళు మాత్రమే తీసుకోవడం ఇలా నియమాలను పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్నప్పుడు ఆచరిస్తూ ఉంటారు.
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ కి ఎంత ప్రత్యేకమో కానీ.. ఆయన ఫ్యాన్స్ కి మాత్రం చాలా ప్రత్యేకం.. కారణం పవన్ ఈ ఏడాది ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిచి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. అది ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకమే .
ఇక డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ మరిన్ని శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రతి రోజు ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే ప్రతి ఏడులాగే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కూడా వారాహి దీక్ష తీసుకున్నారు. ఈరోజున దీక్ష స్వీకరించిన పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు దీక్షలో ఉంటారు. దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు పవన్.