ప్రస్తుతం సొషల్ మీడియా, ప్రభాస్ అభిమానులే కాదు.. కామన్ ఆడియన్ కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం మ్యానియాతో కొట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా కల్కి గురించిన కబుర్లే వినిపిస్తున్నాయి. బుక్ మై షో లో కల్కి బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే సునామీలా టికెట్స్ బుక్ అవడం చూస్తే సినిమాపై ఎంతగా క్రేజ్ ఉందొ అర్ధమవుతుంది.
ఇక పెద్ద సినిమా కావడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మాతల రిక్వెస్టు మేరకు ఇక్కడ కల్కి సినిమా టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా స్పెషల్ షోస్ కి కూడా అనుమతులిచ్చింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందా.. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని చాలా ఇబ్బందులు పెట్టింది. ఏ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచుకునే అనుమతులు కానీ, స్పెషల్ షోస్ కి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేసింది.
అంతేకాదు ఉన్న రేట్లని తగ్గించి నిర్మాతలు నష్టపోయే మాదిరి జగన్ ప్రభుత్వం వ్యవహరించింది. మరి చంద్రబాబు-పవన్ ప్రభుత్వం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ విషయంలో ఎలా వ్యవహరిస్తోంది అనే ఆతృతలో చాలామంది ఉండగా.. కల్కి సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునెలా గత రాత్రి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ లో 75రూపాయలు, మల్టిప్లెక్స్ లో 125 రూపాయలు పెంచుకునేలా జీవో జారీ చేసింది.
మల్టి ప్లెక్స్ ల్లో 125 పెరగడం గత ఐదేళ్ళలో ఇదే మొదటిసారి అంటూ అప్పుడే బ్లూ మీడియా ఏడుపు కూడా స్టార్ట్ చేసేసింది. ఇక ఏపీ ప్రభుత్వం నుంచి కల్కి స్పెషల్ షోస్ విషయంలో ఎలాంటి స్పందన లేదు.