ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఏం బాలేదు. 2024 ఎలక్షన్ లో ఓడిపోయినందుకు బాధపడాలో, లేదంటే సొంత నేతలే విమర్శిస్తుంటే ఏడ్వాలో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఊరూరా ఎంతో ప్రస్టేజియస్ గా తీసుకుని కట్టుకుంటున్న వైసీపీ పార్టీ కార్యాలయాలను అనుమతులు లేని కారణంగా కూలదోస్తుంటే ఎలా అడ్డుకోవాలో తెలియని స్థితిలో జగన్ ఉన్నాడు.
నామ మాత్రం గా అసంబ్లీకి వెళ్లి ఆ తరవాత తాడేపల్లి నుంచి పులివెందుల ప్యాలెస్ కి వెళ్ళిపోయాడు. పులివెందుల వెళ్ళగానే జగన్ ఇంటిపై వైసీపీ కేడర్ జగన్ ఇంటిపై రాళ్లు వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. జగన్ తీరుపై వైసీపీ కేడర్ రగిలి పోయి ఉంది. ఆ ఆగ్రహజ్వాలలు జగన్ పై తిరగబడేలా చేస్తుంది. జగన్ ప్రభుత్వంలో కేడర్ ని పట్టించుకోకపోవడమనేది వైసీపీ కి ఓటమిలో ప్రధానంగా వినిపిస్తోన్న కారణం.
పులివెందుల వెళ్ళగానే జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు జగన్ బెంగుళూరు ప్యాలెస్ గేటు వద్ద కూడా సైకో జగన్, గో బ్యాక్ జగన్, డౌన్ డౌన్ జగన్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు బెంగుళూరు లోనూ జగన్ ని ఛీ కొట్టారంటూ పలు ఛానల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అది చూసిన నెటిజెన్స్.. ఏంటి జగన్ బెంగుళూరులో కూడా నీపై అంత వ్యతిరేఖత ఏల.. ఇది నిజమా అంటూ కామెంట్ చేస్తున్నారు.