అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కుడు, పథకాలు వేసుడు అంటూ ఓటు బ్యాంకు ని బాగా నమ్మిన జగన్ మోహన్ రెడ్డి.. అప్పుడు ప్రజలని కలవడానికి మాత్రమేనా.. కనీసం ఎమ్యెల్యేలు, మంత్రులు, కార్యకర్తలని కలవడానికి సమయం లేదో.. లేదంటే అవసరం లేదు అనుకున్నాడో కానీ.. అప్పుడు ఎక్కడికెళ్లినా పారదాల మాటున ప్రయాణం చేసేవాడు.
మరి అధికారం కోల్పోయాక జగన్ మోహన్ రెడ్డిలో మార్పు ఏమైనా వచ్చిందా అని చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు వేస్తుంటే.. ఆయన కింద పని చేసిన బ్లూ మీడియా మాత్రం జగన్ ధోరణి మారలేదు, అధికారంలో ఉన్నప్పుడు, అధికారం పోయినప్పుడు జగన్ లో అహంకారం మాత్రం తగ్గలేదు అంటూ కథనాలు ప్రసారం చేస్తుంది.
మరి ఇలా జగన్ ని విమర్శిస్తే ఆయనలో మార్పు వస్తుంది అని బ్లూ మీడియా అనుకుంటుందేమో అందుకే పదే పదే ఇలాంటి విమర్శనాస్త్రాలను సాధిస్తుంది. ఈమధ్యన అనే కన్నా జగన్ నిన్న పులివెందుల వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలని కలవడం, వాళ్ళ సాధకబాధకాలు వినడం, వాళ్ళని ఓదార్చడం చేస్తున్నాడు.
ఇది చూసిన చాలామంది అధికార పక్షంలో ఉన్నపుడు ప్రజలని కలిసి వాళ్ళ బాధలని తెలుసుకుని పరిష్కరించే మార్గం కనుగోవాల్సింది పోయి.. ఓడిపోయాక ప్రజల దగ్గరకి వెళ్లి ఓదార్చుతూ వారి సమస్యలని విని అధికారం లేనప్పుడు ఇప్పుడేం పరిష్కరిస్తావయ్యా జగనూ అంటూ కామెడీగా నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.