తెలంగాణాలో టికెట్ రేట్ల పెంపుపై అనుమతి రాగానే ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ ల పాన్ ఇండియా ఫిలిం కల్కి 2898 AD బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన దగ్గర నుంచి కల్కి టికెట్స్ కోసం బుక్ మై షో ఓపెన్ చేస్తే ఓ తుఫాన్ లా, సునామీలా జరిగిపోతున్నాయి బుకింగ్స్. కల్కి టికెట్స్ కోసమని చూస్తే ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వని పరిస్థితి.
ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా కల్కి 2898 AD కోసం ఎంత క్రేజీ గా ఉన్నారో.. ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధమవుతుంది. తెలంగాణాలో టికెట్ రేట్ల పెంపు ని కూడా పట్టించుకోకుండా ఆడియన్స్ కల్కి ని థియేటర్స్ లో వీక్షించేందుకు రెడీ అవుతున్నారని ఈ బుకింగ్స్ చూస్తే కాదు కాదు హాట్ కేకుల్లా అమ్ముడు పోయిన కల్కి బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన కల్కి రెండు ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యాయి. అలాగే ఈ చిత్రంలో పలు భాషల ఇండస్ట్రీల స్టార్స్ నటిస్తున్నారు. అలాగే గత ఐదు నెలలుగా పెద్ద సినిమాలు లేకపోవడం.. రాబోయే కల్కి పై మరింత హైప్ పెరిగేలా చేసింది. మరి కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా బుక్ అవడం చూస్తే ప్రీ బుకింగ్స్ తోనే కల్కి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం ఖాయం. ఈ లెక్కన కల్కి ఓపెనింగ్స్ కుమ్మెయ్యడం ఖాయం అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి.!