జగన్ ప్రభుత్వం పై టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతగా కసి పెరిగిందో ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. సినిమా ఇండస్ట్రీని జగన్ ప్రభుత్వం ఎంతగా ఇబ్బందులు పెట్టిందో అందరికి తెలుసు. మెగాస్టార్ చిరు, రాజమౌళి, ప్రభాస్, మహేష్ లాంటి వాళ్ళని జగన్ అవమానించిన తీరుకి సినిమా ఇండస్ట్రీ కుత కుత ఉడికిపోయింది. అభిమానులు హార్ట్ అయ్యారు. అదంతా ఓ ఎత్తు.
పెద్ద సినిమాలు విడుదలవుతున్న సమయంలో స్పెషల్ షోస్ కి అనుమతులివ్వకుండా, టికెట్ రేట్స్ పెంచుకోనివ్వకుండా జగన్ ప్రభుత్వం నిర్మాతల్ని ఇబ్బంది పెట్టని రోజు లేదు. అందుకే జగన్ ప్రభుత్వం ఓడిపోయి NDA కూటమి అధిరంలోకి వచ్చింది అనగానే సినిమా ఇండస్ట్రీ లోని ప్రముఖులంతా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. పర్సనల్ గా పార్టీలు చేసుకున్నారు.
జగన్ ఓడిపోయి, కూటమి అధికారంలోకి రావడంతో ఆ సక్సెస్ ని మాంచి పార్టీతో సెలెబ్రేట్ చేసుకోవాలని సినిమా ఇండస్ట్రీ లోని ప్రముఖ నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ డిసైడ్ అయ్యారు. ఆయన మాత్రం బహిరంగంగానే ఇండస్ట్రీ ప్రముఖులకు, మీడియా వారికీ పార్టీ ఇవ్వడం చూసిన వారంతా జగన్ ప్రభుత్వంపై ఇంత కసి పెంచుకున్నారా అని మాట్లాడుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వం లో సీఎం స్థానంలో ఉన్న జగన్ దగ్గర నుంచి మంత్రుల వరకు సినిమా ఇండస్ట్రీ పీపుల్ ని పురుగుల కన్నా హీనంగా చూడడమే వారిలో ఇంత కసి పెరగడానికి కారణమైంది. ఇప్పుడు ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారం చెపట్టింది.. కాబట్టే ఇలా పార్టీ అంటూ సినిమా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.