Advertisementt

వైఎస్ జగన్‌కు అన్నీ బ్యాడ్ డేస్!

Sun 23rd Jun 2024 11:44 AM
jagan  వైఎస్ జగన్‌కు అన్నీ బ్యాడ్ డేస్!
All bad days for YS Jagan! వైఎస్ జగన్‌కు అన్నీ బ్యాడ్ డేస్!
Advertisement
Ads by CJ

జగన్‌.. ఇప్పట్లో మంచి రోజుల్లేవమ్మా!

అవును.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అన్నీ బ్యాడ్ డేస్ నడుస్తున్నాయ్! ఎంతలా అంటే.. ఇదిగో ఇప్పటి వరకూ వైసీపీ అధినేత స్థానంలో సీఎం లేదా.. ఏపీ ప్రతిపక్ష  నేత ఏదో ఒకటి ఉండేది.. కానీ ఇప్పుడు కేవలం అధినేతకు మాత్రమే పరిమితమైనంత!. అధికారం పోయింది మొదలుకుని నా అనుకున్న సొంతవాళ్లే చీదరించుకుంటున్న పరిస్థితి..! ఇక గతంలో జగన్ ఏలుబడిని ప్రతిదీ పాయింట్ చేస్తూ వస్తుంటే ఒక్కొక్కటిగా బాగోతాలు బయటికి వస్తున్నాయ్. ఇక జగన్ ఉంటున్న ఇల్లు మొదలుకుని.. వైసీపీ ఆఫీసుల వరకూ ఎప్పుడేం జరుగుతుందో..? బుల్డోజర్ దేన్ని కదిలిస్తుందో తెలియని పరిస్థితి..!

ఎటు నుంచి ఎటు..?

వైనాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి డబుల్ డిజిట్‌ రావడానికి చచ్చి బతికింది..! అది కూడా ప్రతిపక్ష హోదా లేకుండా టీడీపీ, జనసేనను కాదని ఇంచుమించు బీజేపీతో పోటీపడిన పరిస్థితి. ఇప్పటి వరకూ టీడీపీ-వైసీపీ మధ్యే పోటీ అనుకుంటే.. జగన్ పార్టీకి వచ్చిన సీట్లు 11 అయితే.. బీజేపీ గెలుచుకున్న అసెంబ్లీ స్థానాలు 08.. ఇంకా చెప్పాలంటే జనసేన గెలుచుకున్న 21 స్థానాల్లో సగం మాత్రమే..! ఇక టీడీపీ అంటారా అస్సలు పోలికే అక్కర్లేదు. దీంతో వైఎస్ జగన్‌ను ప్రతిపక్షనేతగా పిలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఎంతసేపూ మాజీ సీఎం, వైసీపీ అధినేత అని చెప్పుకోవాల్సిన, రాసుకోవాల్సిన పరిస్థితి. అసలు ఇలాంటి ఫలితాలు వస్తాయని బహుశా వైసీపీ నేతలు, కార్యకర్తలు అటుంచితే.. వైఎస్ జగన్ కలలో కూడా ఊహించి ఉండరేమో.. ఇదే విషయాన్ని ఫలితాల తర్వాత జగన్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు.

ఏం జరుగుతోంది..?

ఇక ఫలితాల సంగతి అటుంచితే విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు.. పోటీచేసిన అభ్యర్థులు పెద్దగా రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బే. దీనికి తోడు జగన్‌కు రైట్, లెఫ్ట్ హ్యాండ్‌గా ఉన్నోళ్లే బీజేపీలోకి పోతున్నారన్న వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇందులో ఎంతో నమ్మకస్తుడు ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దాయన.. రాయలసీమకు అన్నీ తానై చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకుంటున్నారని వార్తలు ఒక్కసారిగా హీటెక్కించాయి. దీనికి తోడు త్వరలోనే తన సోదరుడు, కుటుంబ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేస్తారని.. త్వరలోనే కడప పార్లమెంట్‌కు ఉప ఎన్నిక రానుందని సాక్షాత్తూ బీజేపీ కీలక నేత, హైకమాండ్‌కు దగ్గరి వ్యక్తి.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే బ్యాగ్రౌండ్ పెద్ద తతంగమే నడుస్తోందని తెలుస్తోంది.

అడుగుడునా ఎదురుదెబ్బలే..!

ఎన్నికలు ఏ నిమిషాన జరిగాయో కానీ.. నాటి నుంచి నేటి వరకూ అడుగడుగునా వైఎస్ జగన్‌కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇక రానున్న రోజులు అదేనబ్బా.. ఈ ఐదేళ్లు ఇంతకుమించి పరిణామాలను చవి చూడాల్సి వస్తుందో అని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. రుషికొండ రాజ్‌మహల్ రహస్యం బయటపడటం అది కాస్త ఓ రేంజిలో బ్లాస్ట్ అవ్వడంతో జగన్ అడ్డంగా బుక్కయ్యారు. అసలు ఈ ప్యాలెస్ ఎందుకు కట్టారు..? ఎవరికోసం కట్టారో..? తెలియని పరిస్థితి. పోనీ ఫలానా దానికి, ప్రభుత్వం కోసమే కట్టామని కనీసం జగన్ బయటికి వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఫర్నీచర్ గొడవ.. బాబోయ్ దీనిపై నానా రచ్చే జరిగింది. నాడు కోడెల.. నేడు జగన్ అంటూ తెగ ట్రోలింగ్‌కు గురయ్యారు. ఆఖరికి ఫర్నీచర్ దొంగ అని బిరుదును కూడా అధికారపక్షం ఇచ్చేసింది.

ఊచకోతలు..!

వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో మొదలై.. నారా చంద్రబాబు అరెస్ట్ వరకూ వెళ్లింది. టీడీపీ కార్యకర్తలు మొదలుకుని అధినేత వరకూ వైసీపీ ఎవరిని ఎన్నెన్ని ఇబ్బంది పెట్టిందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఐదంటే ఐదేళ్లు సీన్ కట్ చేస్తే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేసింది. ఇక మొదలెడదామా..? అంటూ చంద్రబాబు ఛార్జ్ తీసుకోక ముందు నుంచే కార్యకర్తలకు ఛాన్స్ ఇచ్చేశారు. గ్రామాల్లో, పల్లెల్లో.. పట్టణాల్లో ఇలా నియోజకవర్గ స్థాయిలో ఎవరిమీద పగ ఉందో.. వారిని ఊచకోతలు కోసేశారు. ప్రాంతీయ మీడియాలో ఇవన్నీ రాకపోయినా జాతీయ మీడియా, సోషల్ మీడియాలో కోడై కూశాయి. కానీ ఇంతవరకూ చంద్రబాబు కానీ, ఆయన టీమ్ కానీ స్పందించిన దాఖలాల్లేవ్. పైకి మాత్రం ఎవర్నీ ఉపేక్షించనని వార్నింగ్. ఇక వైఎస్ జగన్ హయాంలో కట్టిన కట్టడాలు, జగన్ బొమ్మ కనిపించొద్దని, ఎన్టీఆర్ యూనివర్శిటీ, అసలు వైఎస్సార్ విగ్రహమే కనపడొద్దన్నట్లుగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రవర్తించిన పరిస్థితి. కనీసం వారిని ఎదుర్కొనేందుకు డేర్ చేయలేని పరిస్థితి వైసీపీది.

కుప్పకూల్చేశారు..!

ఇక కూల్చివేతల విషయానికొస్తే.. శనివారం తెల్లవారుజామున వైసీపీ కేంద్ర కార్యాలయంతో మొదలైన కూల్చివేతలు రేపో, మాపో వైజాగ్, ఉభయ గోదావరి, కడప జిల్లా వరకూ వెళ్లినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే.. వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీసు నిర్మాణానికి ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టింది..? టీడీపీ కేంద్ర కార్యాలయంపైకి దాడికి దిగింది ఇవన్నీ చంద్రబాబుకు గుర్తుండే ఉంటాయ్ కదా..!. రివెంజ్ తీర్చుకోకుండా ఎందుకుంటారో చెప్పండి..! ఒకవేళ రివెంజ్ కాదనుకున్నా.. అక్రమంగా కట్టడాలు ఉంటే ఉక్కుపాదం మోపడానికి బాబు రంగం సిద్ధం చేసేశారు. అందుకే.. జూన్-22న తాడేపల్లిలోని బోట్ యార్డులో నిర్మాణ దశలో ఉన్న కేంద్ర కార్యాలయం అక్రమంగా నిర్మిస్తున్నారని.. ఎలాంటి అనుమతులు లేవని భారీ బందోబస్తు మధ్య కుప్పకూల్చేశారు. అంతేకాదు.. వైజాగ్‌లోని వైసీపీ కార్యాలయం అక్రమంగా కట్టారని నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక రాజమండ్రిలోనూ ఇదే పరిస్థితి. రానున్న రోజుల్లో ఇలా లెక్కలు తీసి అక్రమంగా నిర్మించినవి కూప్పకూల్చేసి.. నేలమట్లం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అన్నీ పాయే.. ఆఖరికి..!

ప్రతిపక్ష హోదా పాయే.. కార్యకర్తలు రివర్స్ అయిపాయే.. ఆఖరికి సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్తే సీఎం.. సీఎం అని అరిచిన నోళ్లే ఇప్పుడు డౌన్.. డౌన్ జగన్ అని అరుస్తున్న పరిస్థితి. జగన్ ఇంటిపైనే రాళ్లదాడికి దిగిన పరిస్థితి. అంటే ఏ రేంజిలో జగన్‌పై కోపంతో ఉన్నారో ఈ ఒక్క సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. ఏ వాలంటీర్లను అయితే జగన్ నియమించారో ఇప్పుడు వాళ్లంతా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ హయాంలోని ఎమ్మెల్యేలు, ఆఖరికి జగన్‌పై కూడా కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే.. ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్లపై కేసుపెడితే తిరిగి వాలంటీర్ జాబ్ ఇస్తామని టీడీపీ చెబుతోంది.. దీంతో వైసీపీ నేతతో మొదలై అధినేత వరకూ వచ్చినా రావొచ్చు. అయితే జీరోతో ప్రారంభమైన జగన్ హీరో అయ్యారు.. మళ్లీ జీరో నుంచి మొదలెడతారని ధీమాగా చెప్పుకుంటున్న పరిస్థితి. చూశారుగా.. ఇదీ జగన్ బ్యాడ్ డేస్ కథ.. మంచిరోజులు ఎప్పుడొస్తాయో అని వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి..!

నాడు.. నేడు.. ఇలా..!

అయితే ఇంత జరుగుతున్నా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, వీరాభిమానులు మాత్రం ఎంతో ధీమాగానే ఉన్నారు. ఈనాడు జగన్ ఓటమి ఎంత భయంకరంగా ఉందో .. ఒకనాడు జగన్ గెలుపు కూడా అంతే భయంకరంగా ఉండే.!!. ఒక్కడే వచ్చి 151 సీట్లు సింగిల్‌గా కొట్టాడు.. ఆ దెబ్బ ముందు 40 ఏండ్ల రాజకీయం ఏం అయ్యింది..?. సరే ఈరోజు మళ్లీ తిరిగి కొట్టాడు (ముగ్గురు కలిసి ).. కానీ ఆ ఒక్కడు కొట్టిన దెబ్బ భారతదేశం మరవదు..!. జగన్ గెలుపు ఎంత బలమైనదో.. ఓటమి కూడా అంత బలహీనమైంది.. తిరిగి కొట్టడానికి ఎక్కువ సమయం పట్టదు..! అదంతా కాదు.. తమ్మి, నువ్వు ఎందుకు జగన్ కోసం ఇలా చింపుకుంటున్నావ్ అని అడిగితే.. రాజకీయంగా రూపాయి ఆశించేవాడిని కాదు.. ఆ అవసరం అంతకన్నా లేదు..! చంద్రబాబు , పవన్ నాకు ఏం పాలోళ్లు లేదా పగోళ్ళు కూడా కాదు..!!. కేవలం.. తండ్రి చనిపోయి నప్పటి నుంచి, దేశాన్ని శాసించే సోనియా గాంధీ కేసుల నుంచి, బాబు గారి వికృత రాజకీయ క్రీడ వరకు.. తొమ్మిదేళ్లు ఎర్రటి ఎండలో తొక్కుకుంటూ...తొక్కుకుంటూ.. సింగిల్‌గా సింహంలా సీఎం అయ్యాడు చూడు.. అక్కడ , ఆ పోరాట స్ఫూర్తి నచ్చింది.. ఆ గట్స్ నచ్చినయ్ అంతే.. జీవితాంతం జగన్ అభిమానిగా ఉంటాం.. గెలిపిస్తాం.. మళ్లీ సీఎంగా చూస్తాం.. చచ్చే దాకా జగన్‌తోనే ఉంటామని వీరాభిమానులు చెబుతున్న పరిస్థితి.

All bad days for YS Jagan!:

Jagan.. these are good days!

Tags:   JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ