పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం జూన్ 27 శుక్రవారమే విడుదల కాబోతుంది. హైదరాబాద్ లో బుజ్జి కార్ రివీల్ ఈవెంట్ అలాగే ముంబై లో కల్కి ప్రెస్ మీట్ జరిగాయి. నాగ్ అశ్విన్ ఇంటర్వూస్ ఇస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అమరావతి లేదంటే హైదరాబాద్ లో కల్కి 2898 AD ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ నిర్వహించబోతున్నారని అన్నారు కానీ.. అది ఇప్పుడు లేదు అని తెలుస్తోంది.
ఇక ప్రభాస్ కూడా కల్కి విడుదలకు నాలుగైదు రోజుల ముందే ఫారిన్ టూర్ కి వెళ్ళబోతున్నాడట. ప్రభాస్ తన సినిమాల రిలీజ్ నేపథ్యంలో ఏదో ఒక వెకేషన్ ప్లాన్ చేసుకుంటాడు. రిజల్ట్ తో పని లేకుండా విదేశాల్లోనే గడుపుతాడు. గతంలో ఆదిపురుష్ విడుదల టైమ్ లో అమెరికా వెళ్లిన ప్రభాస్ సలార్ విడుదల సమయానికి ఇటలీలో ఉన్నాడు.
ఇప్పుడు కల్కి విడుదలకు ముందు ప్రభాస్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడని, కల్కి రిలీజ్ టైమ్ కి ఫారిన్ ట్రిప్ లో అంటే విదేశాల్లో ఉంటాడని అంటున్నారు. ఇకపై కల్కి ప్రమోషన్స్ కూడా ఏమి లేవు కాబట్టి ప్రభాస్ రేపో మాపో ఫారిన్ ట్రిప్ కి రెడీ అవుతాడన్నమాట.