ప్రస్తుతం హిందీ అవకాశాల కోసమే సమంత కాచుకుని కూర్చుంది అనేలా ఆమె ఓవర్ డోస్ గ్లామర్ షో కనిపిస్తుంది. ఎప్పుడు గ్లామర్ కి ప్రాధాన్యతనిచ్చే సమంత.. ఈమధ్యన అది మరి కాస్త ఎక్కువ చేసింది. టూ మచ్ గ్లామర్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. సౌత్ హీరోలు అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. దానితో సమంత ఫోకస్ బాలీవుడ్ పై పెట్టింది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ తో హిట్ కొట్టిన సమంత సిటాడెల్ హాని బన్నీ సీరీస్ పూర్తి చేసింది.
అయితే జవాన్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన షారుఖ్ ఇప్పుడు కూతురు సుహానా ఖాన్ ని హీరోయిన్ గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. సుహాన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే చిత్రంలో తానొక కీలక పాత్ర చేస్తే అది సుహాన్ కెరీర్ కి ప్లస్ అవుతుంది కాబట్టి.. అలాంటి ప్లాన్ లో షారుఖ్ ఉన్నాడు.
మరోపక్క డంకీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈసారి రాజ్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ తో షారుఖ్ ని చూపించాలనుకుంటున్నారట. అందులోనే సమంత ని హీరోయిన్ గా అనుకుంటున్నారని, ఇప్పటికే జవాన్ లో షారుఖ్ సరసన కొత్తగా నయనతార కాంబో ని పెట్డడంతో ఈ జంట ఫ్రెష్ గా ప్రేక్షకులకి కనిపించింది.. ఇప్పుడు సమంత కూడా షారుఖ్ పక్కన కొత్తగా కనిపించే ఛాన్స్ ఉంది అందుకే ఆమెని అప్రోచ్ అయ్యే ప్లాన్ లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా లో కథనాలు వస్తున్నాయి.
మరి సమంత నిజంగా షారుఖ్ సరసన చోటు దక్కించుకుంటే అది మాములు విషయం కాదు. చూద్దాం ఇది కేవలం బజ్జా లేదంటే నిజమా అనేది.