పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం అధికారాన్ని ఎంజాయ్ చెయ్యడం కాదు.. ఆయన పవర్ లోకి రాగానే పనిలోకి దిగిపోయారు. నిన్న అసంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసారు. ఈరోజు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. అసంబ్లీ లో పవన్ కళ్యాణ్ సరదాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడి గురించి చేసిన కామెంట్స్, జగన్ పై, వైసీపీ పై చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. ఆయన అసంబ్లీ లో అడుగుపెట్టే క్షణాన్ని అభిమానులు తెగ ఎంజాయ్ చేసారు. అంతా బాగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ జులై మొదటి వారం ఇటు సినిమాలపై ఓ కన్నేస్తారని.. ఆయన చెయ్యాల్సిన మూడు సినిమాల షూటింగ్స్ ని త్వరగా పూర్తి చేస్తారని, అందులో ముందుగా ఆయన హరి హర వీరమల్లు బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు జులై మొదటి వారంలో వీరమల్లు సెట్స్ లోకి రాబోతున్నారంటూ ప్రచారం గట్టిగానే జరిగింది.
అయితే జులై మొదటి వారంలో హరి హర వీరమల్లు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో మిగతా షూటింగ్ స్టార్ట్ అవుతుంది, అదే వారంలో పవన్ కళ్యాణ్ వీరమల్లు సెట్స్ కి వచ్చేస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు అంటూ వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ పవర్ లో ఉన్నారు. తనకి ఉన్న ఈ బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం ఫ్రీ అయ్యాక వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటారని ఏఎం రత్నం చెప్పారు.
దానితో పవన్ కళ్యాణ్ ఇప్పుడప్పుడే సినిమాలు పూర్తి చేసే ఆలోచనలో లేరని అర్ధమవుతుంది. కానీ చాలా వరకు పూర్తయిన వీరమల్లు, OG నిర్మాతలు మాత్రం పవన్ కాస్త దయతలిస్తే చాలు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. మరి పవన్ ఎప్పుడు కరుణిస్తారో చూడాలి.