కల్కి 2898 AD చిత్రం విడుదలవుతుంటే ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. వచ్చే శుక్రవారమే కల్కి విడుదల. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆత్రుత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఏమిటి అంటే.. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సిల్ చేసే ఆలోచనలో కల్కి మేకర్స్ ఉన్నారట.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి వేదికగా మొదటి సినిమా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. కల్కి 2898 AD చిత్ర ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, రజినీకాంత్ గెస్ట్ లుగా రాబోతున్నారని ఒకసారి, ఆ తర్వాత అమరావతిలో వర్షాలు పడే అవకాశం ఉన్న కారణంగా ఆ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసారు అన్నారు.
ఇక రీసెంట్ గా ముంబైలో కల్కి ప్రెస్ ఇంటరాక్షన్ జరిగింది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. అది సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కారణాలు తెలియరాలేదు కానీ.. మొదట్లో కల్కి ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేసిన మేకర్స్.. విడుదల దగ్గరకొచ్చేసరికి ఇలా చెయ్యడం ఫ్యాన్స్ ని డిజ్ పాయింట్ చెయ్యడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.