గత ఐదేళ్ళలో అరాచక పాలన ఎలా ఉన్నా కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు, వంశి వల్లభనేని, అనిల్ కుమార్ యాదవ్ ల బూతులు మాత్రం ప్రజలు బాగా పర్సనల్ గా తీసుకున్నారు. ఇలాంటి మంత్రులు, ఎమ్యెల్యేలు మనకవసరం లేదు అని అధికారం అటుంచి కనీసం అసంబ్లీ గేటు కూడా దాటనివ్వకుండా శిక్షించారు. అయితే గత ప్రభుత్వంలో అధికారం ఉంది కదా అని నోరు పారేసుకుంటూ ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, లోకేష్ లని పర్సనల్ గా టార్గెట్ చేసిన కొడాలి పై టీడీపీ నేతలకి, కార్యకర్తలకి కాలిపోతుంది.
2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ వెంటనే కొడాలి నాని లాంటి వాళ్ళ పని పడుతుంది అనుకుంటే ఇప్పటివరకు అదేమీ జరగలేదు. దానితో చాలామంది టీడీపీ అభిమానులు డిజ్ పాయింట్ అవుతున్నారు. గత రెండు వారాలుగా కామ్ గా కుక్కిన పేనులా ఉన్న కొడాలి నాని మళ్ళీ యాక్టీవ్ అయ్యాడు. తన పాత పద్ధతిలోనే చంద్రబాబు పై విమర్శలు మొదలు పెట్టాడు. అయితే వైసీపీ పెంచి పోషించిన వాలంటీర్లు ఇప్పుడు జగన్, వైసీపీ నేతల మెడకి చుట్టుకుంటున్నారు. గతంలో తమని బెదిరించి తమని రాజీనామాలు చెయ్యాలని వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చారంటూ టీడీపీ మంత్రులు, ఎమ్యెల్యేల దగ్గర మొరపెట్టుకుంటున్నారు.
దానితో టీడీపీ నేతలు మిమ్మల్ని బెదిరించిన వాళ్లపై ముందు కేసులు పెట్టి అపుడు రండి మీ ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తామంటూ చేబుతూన్నారు. అందులో మొదటి దెబ్బ కొడాలి నానిపైనే పడింది. ఇప్పటివరకు కొడాలి నాని పై ఎలాంటి యక్షన్ తీసుకుంటారా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో మొదటిగా కొడాలి పై వాలంటీర్లు గుడివాడలో కేసు పెట్టారు.
వైసీపీ పార్టీకి సపోర్ట్ చెయ్యాలంటూ తమని ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయించడంటూ కొడాలి నాని అలాగే అతని సన్నిహితులు, అనుచరులపై వాలంటీర్లు కేసులు పెట్టడం హాట్ టాపిక్ కాగా.. అబ్బ కొడాలి నాని కి ఫస్ట్ దెబ్బ అంటూ గుడివాడ ప్రజలే కామెంట్స్ చేస్తున్నారు.