పవన్ కళ్యాణ్ గత పదేళ్లుగా ఎమ్యెల్యే కాదు కదా, కనీసం వార్డ్ మెంబెర్ కూడా కాలేదు, పవన్ కళ్యాణ్ కి గాడిదకొచ్చినట్టుగా 50 ఏళ్ళు వచ్చాయి. ఇక గెలిచే అవకాశం కూడా లేదు, అసలు నీకు బుద్దుందా, నువ్వెంత, నీ బ్రతుకెంత.. పవన్ కళ్యాణ్ ని కనీసం అసంబ్లీ గేటు కూడా దాటనివ్వమంటూ శపధాలు చేసిన మాజీ మంత్రి రోజా కి ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ అసంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసింది చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యుంటుంది.
నాగబాబు.. పవన్ కళ్యాణ్ ని అసంబ్లీ గేటు కూడా తాకనివ్వను అన్నారు, సింహమొస్తుంది అంటూ ఓ వీడియో షేర్ చేసారు ఈ రోజు ఉదయమే. ఇక పవన్ కళ్యాణ్ ఎమ్యెల్యేగా కాదు.. ఇప్పుడు డిప్యూటీ సీఎం నుంచి పలు శాఖలకు మంత్రిగా మారారు. పవన్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం లో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు.. ఒకప్పుడు గెలవలేదు గెలవలేదు అని మాట్లాడినోళ్లే ఈ రోజు పవన్ కళ్యాణ్ కెపాసిటీని, పవర్ ని పొగుడుతున్నారు అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ పై అతిగా రెచ్చిపోయిన రోజా కి మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి కన్నా, తాను ఓడిపోయిన బాధ కన్నా ఈరోజు అసంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ పవన్ అనే నేను అన్నప్పటి నుంచి కంటి మీదకి కునుకు రాదు.. ఆ బాధ చెప్పనలవి కాదు. ఇప్పుడు మాట్లాడు రోజా పవన్ గురించి అంటూ రోజా ని ట్రోల్ చేస్తూ ఆమె గతంలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల వీడియోస్ ని వారు వైరల్ చేస్తున్నారు.