కాజల్ అగర్వాల్ ఒకప్పుడు టాలీవుడ్ చందమామ. ఇప్పటికి అదే అందాన్ని, అదే గ్లామర్ ని మైంటైన్ చేస్తూ తానింకా నటనకు రెడీనే, గ్లామర్ షో చెయ్యడానికి వెనకాడను అనే సంకేతాలు ఇస్తూనే ఉంది. కానీ పెళ్ళైన తర్వాత అవకాశాలు ఎలా ఉంటాయో చూస్తూనే ఉన్నాము. పెళ్లి అనేది హీరోయిన్స్ కి పెద్ద విషయం కాదు, గ్లామర్, పెరఫార్మెన్స్ ఉంటే చాలు, పెళ్లి తర్వాత ఏది మారదు అంటూ కాజల్ రీసెంట్ గానే ఇంటర్వ్యూలో చెప్పింది.
ఇక పెళ్లి తర్వాత వరసగా విమెన్ సెంట్రిక్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్న కాజల్ కి అవి నిరాశనే మిగులుస్తున్నాయి. భగవంత్ కేసరి కాజల్ అగర్వాల్ కి ఊరటనిచ్చినా.. ఆ సినిమా సక్సెస్ మొత్తం బాలయ్య-శ్రీలీల పట్టుకుపోయారు. ఇక కమల్ హాసన్ ఇండియన్ 2 లో కాజల్ అగర్వాల్ ది ఏదో గెస్ట్ పాత్ర అంటున్నారు.
మరోపక్క సత్యభామ రిజల్ట్ కాజల్ ని బాగా డిజ్ పాయింట్ చేసింది. ఇకపై కాజల్ అగర్వాల్ ఎలాంటి స్క్రిప్ట్స్ ఎన్నుకుంటుంది, ఏ జోనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది, సీనియర్ హీరోల తో సై అంటుందా, అసలు సీనియర్ హీరోలు కాజల్ ని కన్సిడర్ చేస్తారా, ఇకపై కాజల్ దారెటు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.