2024 ఎలక్షన్స్ లో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముహుర్తం నుంచే కార్యాచరణలోకి దిగిపోయారు ఆంధ్రప్రజలందరి కార్య సాధకుడు చంద్రబాబు. మంత్రులకు శాఖల కేటాయింపులో ఆచితూచి వ్యవహరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా ఇతర మంత్రులందరికీ కూడా వారి వారి అభీష్టానికి, అర్హతకి తగ్గ పదవులని ప్రకటించి అందరిని కార్యన్ముఖులని చేసారు. ఇక క్యాబినేట్ మంత్రులందరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.
చంద్రబాబు విషయానికొస్తే ముఖ్యమంత్రిగా తన తోలి సంతకాల వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చేసి పోలవరం వైపు అడుగులేసారు. అక్కడ జరిగిన అవకతవకలన్నీ గమనించారు. ఇప్పుడు ఈ దశలో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణం ఏ స్థాయి నుంచి ప్రారంభించాలి, ఎప్పటికి పూర్తవుతుంది, అందుకయ్యే ఖర్చెంత, కావాల్సినవేమిటి.. అనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చారు. పోలవరం ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
అక్కడితో ఆగలేదు చంద్రబాబు నేడు అమరావతికి విచ్చేసారు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన కట్టడాలను, నిర్వీర్యం అయిపోయిన అభివృద్ధి పనులని కళ్లారా చూసారు, కదిలిపోయారు. గతంలో అధికారం అందుకుని కేవలం అహంకారంతో అమరావతిని పక్కనపెట్టేసి మూడు రాజధానుల ముచ్చట్లు చెబుతూ.. ముందుకు వెళ్ళిపోయిన జగన్ ప్రభుత్వం ఐదేళ్లు అరచేతిలో వైకుంఠమే చూపించింది, అమరావతి రైతుల పోరాటం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించింది.
అయితే నేడు అమరావతి ని సందర్శించిన అనంతరం రాజధాని నిర్మాణం పట్ల తనకున్ననిర్దిష్టమైన ప్రణాలికను పాత్రికేయులతో పంచుకున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఇచ్చిన డెఫినేషన్ అందరి ఆంధ్రుల ప్రశంశలు పొందుతోంది. A అంటే అమరావతి అంటూ - P అంటే పోలవరం అంటూ AP ని ఆయన డిఫైన్ చేసిన విధానం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
దానితో పాటే చంద్రబాబు వేసిన మరో సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమరావతి నిర్మాణం కోసం 1631రోజుల పాటు ఉద్యమం చేసారు అక్కడి ప్రజలు. ఒక్కసారి గనక మీరు చూస్తే 1631 అన్ని కలిపితే పదకొండు.. ఆ 11 సీట్ల ఫలితం మాత్రమే జగన్ కి మిగిలింది, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అనడం అక్కడ ప్రాంగణాన్ని నవ్వులతో హోరెత్తించింది.