ఒక్క పాన్ ఇండియా సినిమా డేట్ పోస్ట్ పోన్ అయ్యి కొత్త డేట్ ని లాక్ చెయ్యడం మిగతా హీరోలకి ఇబ్బందిగా మారింది. పుష్ప ద రూల్ ఆగష్టు 15 నుంచి పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 6 కి కొత్త డేట్ లాక్ చేసుకుంది. అక్కడే మిగతా హీరోలకి ఇబ్బంది తలెత్తింది. డిసెంబర్ లో నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ సినిమాలతో పాటుగా మరో సీనియర్ హీరో కూడా డిసెంబర్ లోనే రావాలనుకున్నారు.
ఆయనే బాలయ్య బాబు. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం NBK 109. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సమయం లోనే పుష్ప కొత్త డేట్ వచ్చేసింది. సరే పుష్ప డిసెంబర్ 6 న అన్నారు కాబట్టి రెండు వారాల గ్యాప్ లో అంటే డిసెంబర్ 20 తర్వాత రిలీజ్ చేస్తే బావుంటుంది అని మేకర్స్ భావిస్తున్నారు.
మరి డిసెంబర్ 20 అంటే నితిన్ రాబిన్ హుడ్,నాగ చైతన్య తండేల్ మూవీ ఉన్నాయి. వాటిలో నితిన్ రాబిన్ హుడ్ ని కొద్దిగా ముందే తెచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. కానీ నాగ చైతన్య తండేల్ విషయంలో తికమక పడుతున్నారట మేకర్స్. మరి ఇదంతా పుష్ప డేట్ మారడం వల్లే వచ్చింది అంటూ ఫిలిం నగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.