దీపికా పదుకొనె అలా చెయ్యాల్సింది కాదేమో.. ఈ మాట మేమనడం లేదు.. ఆమె అభిమానులు అంటున్నారు. దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రెగ్నెంట్. అయినప్పటికీ 100 ల కోట్లతో తీసిన సినిమాకి తన అవసరం ఉంది అని గ్రహించి బేబీ బంప్ తో ఇబ్బంది పడుతూనే ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ ల కల్కి ప్రమోషన్స్ కి హాజరైంది.
ఆ విషయంలో దీపికా పదుకొనే డెడికేషన్ ని అప్రిషేట్ చెయ్యకుండా ఉండలేకపోతున్నారు ప్రభాస్ అభిమానులు, నెటిజెన్స్. అంతా బాగానే ఉంది.. స్టేజ్ పైన ప్రభాస్-దీపికా బాండింగ్, అమితాబ్ ప్రభాస్ ని ఆట పట్టించడం, ప్రభాస్ దీపికా కి హెల్ప్ చెయ్యడం ఇవ్వన్నీ కల్కి ముంబై ఈవెంట్ లో హైలెట్ అయ్యాయి.
కానీ దీపికా పదుకొనే స్టేజ్ ఎక్కేటప్పుడు సోఫా మీద నుంచి లేవడానికి చాలా జాగ్రత్తగా ఇబ్బందిగా లేచింది. బేబీ బంప్ తో ఆమె ఇలాంటి ఈవెంట్స్ రావడమే గొప్ప. కానీ దీపికా పదుకొనె హై హీల్స్ వేసుకుని క్యాజువల్ గా నడవం ఆమె అభిమానులు తీసుకోలేకపోతున్నారు. ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఇలాంటి సమయంలో ఎంత స్టార్, ఎంత సెలెబ్రిటీ అయినా ఇలా హీల్స్ వేసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మోడ్రెన్ డ్రెస్ ఓకె. కంఫర్ట్ గానే ఉన్నా.. చెప్పులు మాత్రం హీల్స్ ధరించకుండా ఫ్లాట్ చెప్పులు ధరించి ఉండాల్సింది దీపికా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.