నయనతార ఈమధ్యనే కొడుకులు, భర్త విగ్నేష్ శివన్ తో కలిసి హాంకాంగ్ ట్రిప్ వేశారు. అక్కడ డిస్నిలాండ్ లో కొడుకులతో నయనతార అండ్ విగ్నేష్ శివన్ లు బాగా ఎంజాయ్ చేసారు. కొడుకులతో ఆడుకుంటున్న, ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ జంట.
ఇక తాజాగా నయనతార భర్త విగ్నేష్ శివన్ తో కలిసి రొమాంటిక్ లంచ్ డేట్ లో సందడి చేసింది. అంతేకాదు.. Lunch done right with @wikkiofficial 😍❤️అంటూ ఫొటోస్ ని షేర్ చేసింది. భర్త తో రొమాంటిక్ గా నయనతార కనిపించింది. ఆ పోస్ట్ చూసిన నయనతార మరియు విగ్నేష్ అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.