Advertisementt

దీపికాని పొగిడేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

Thu 20th Jun 2024 10:26 AM
prabhas  దీపికాని పొగిడేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
Prabhas fans praising Deepika దీపికాని పొగిడేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో దీపికా పదుకొనె కల్కి 2898 AD ప్రమోషన్స్ కి రాదేమో.. దీపికా పదుకొనె కల్కి షూటింగ్ పూర్తి కాగానే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది, సో కల్కి ప్రమోషన్స్ కి రాకపోవచ్చని ప్రచారం గట్టిగానే జరిగింది. కల్కి బుజ్జి కార్ రివీల్ ఈవెంట్ కి దీపికా హైదరాబాద్ రాలేదు, సో ఆమె ఇక కల్కి ప్రమోషన్స్ లో పాల్గొనదు అనుకుంటున్నారు.

కానీ దీపికా పదుకొనె అందరి అనుమానాల్ని పటాపంచలు చేసేసింది. ముంబై లో జరిగిన కల్కి ఈవెంట్ లో దీపికా పదుకొనే హాజరైంది. అది కూడా బేబీ బంప్ తో దీపికా కల్కి ప్రమోషన్స్ కి రావడం, ప్రభాస్ ని, కల్కి చిత్ర దర్శకుడు నాగిని పొగడడం ప్రభాస్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే దీపికా డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు.

ఆమె ప్రెగ్నెంట్ అయినా, బేబీ బంప్ తో ఇబ్బంది పడుతున్నా చాలా యాక్టీవ్ గా కల్కి ప్రమోషన్స్ కి రావడం పట్ల చాలామంది దీపికా పై రెస్పెక్ట్ పెరిగింది అంటున్నారు. అంత డెడికేషన్ ఉంది కాబట్టే ఆమె టాప్ హీరోయిన్ అయ్యింది అంటూ ప్రశంసిస్తున్నారు. 

Prabhas fans praising Deepika:

Prabhas Fans Go Crazy As Actor Says Deepika

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ