Advertisementt

డైమండ్ రాణి దమ్ముంటే గుమ్మం దాటు: వర్మ

Wed 19th Jun 2024 05:57 PM
svsn varma  డైమండ్ రాణి దమ్ముంటే గుమ్మం దాటు: వర్మ
Varma sensational comments on Roja డైమండ్ రాణి దమ్ముంటే గుమ్మం దాటు: వర్మ
Advertisement
Ads by CJ

డైమండ్ రాణి అంటూ మాజీ మంత్రి రోజని చాలామంది యాంటీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. రోజా గత ప్రభుత్వంలో అవినీతి మంత్రి గా కాదు డైమండ్ రాణిగా పేరు గాంచింది. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లని అనరాని మాటలతో రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ ని అయితే అసంబ్లీ గేటు కూడా దాటనివ్వమంటూ ఛాలెంజ్ చేసింది.

తాజాగా పవన్ కళ్యణ్ కి పిఠాపురంలో వెన్ను దన్నుగా నిలిచిన వర్మ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి శాలువా కప్పి సన్మానం చెయ్యడమే కాదు.. తాను గుడిలో పూజ చేయించుకుని వచ్చిన కుంకుమ కూడా  పవన్ కళ్యాణ్ కిపెట్టారు. ఆతర్వాత వర్మ మీడియా తో మట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖలు రావడం పట్ల ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారన్నారు.

అయితే సదరు మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ పై చాలామంది చాలా విమర్శలు చేశారు. ముఖ్యంగా అసంబ్లీ గేటు కూడా దాటనివ్వమంటూ కొంతమంది అన్నారు అంటూ అడగగా.. దానికి వర్మ రియాక్ట్ అవుతూ.. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని వ్యాఖ్యలు చేసిన ఆవిడ డైమండ్ రాణి ఇప్పుడు ఆవిడ ఇంటి గుమ్మం కూడా దాటడం లేదు.

ఓడిపోయాక ఇంటి గేటు కూడా దాటని ఆవిడ.. ముందు గుమ్మం దాటి మాట్లాడాలి. మాట్లాడడం నేర్చుకోవాలి, సంస్కారం లేదు. ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి. ఒక నాయకుడు రౌడీ అయితే కింద పని చేసే వాళ్ళు అలానే ఉంటారు. జగన్ కే సంస్కారం లేదు ఇక వాళ్లకేం వస్తుంది అంటూ వర్మ రోజా కి ఎడా పెడా ఇచ్చిపడేసారు. 

Varma sensational comments on Roja:

SVSN Varma Sensational Comments On EX Minster Roja

Tags:   SVSN VARMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ