రేణుక స్వామి హత్య కేసులో హీరో దర్శన్ తో పాటుగా నటి పవిత్ర గౌడ తో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పవిత్ర గౌడ తో సహజీవనం చేస్తున్న దర్శన్.. తన ప్రియురాలు పవిత్రకి అసభ్యకర మెసేజెస్ పంపించిన కారణంగా అభిమాని అని కూడా చూడకుండా రేణుక స్వామిని కిరాయి మానుషులతో అతి కిరాతకంగా హత్య చేయించాడు దర్శన్.
ఇప్పటికే జైలు ఊచలు లెక్కబెడుతున్న దర్శన్ మేనేజర్ శ్రీధర్ కూడా దర్శన్ ఫామ్ హౌస్ లోనే ఆత్మహత్య చేసుకోవడం ఈ కేసులో ట్విస్ట్ గా మారింది. అదలావుంటే పోలిసుల అదుపులో ఉన్న పవిత్ర గౌడ ని పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఊపిరి సలపకుండా అధికారులు ఆమెని చుట్టు ముట్టి విచారించడంతో పవిత్ర ఒత్తిడికి గురైంది అని తెలుస్తోంది.
దానితో పవిత్ర అస్వస్తతకు లోనై కళ్లు తిరిగి పడిపోవడంతో పోలీసులు ఆమెని ఆసుపత్రిలో చేర్చినట్లుగా తెలుస్తోంది. మరోపక్క పవిత్ర తరపు న్యాయవాది పవిత్ర ఆరోగ్యం దృశ్య ఆమెని పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కోర్టులో పిటిషన్ వేసినట్లుగా సమాచారం అందుతుంది. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపు తీసుకుంటుందో అని కన్నడ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.