ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటుగా పాన్ ఇండియా ప్రేక్షకులంతా కల్కి 2898 AD కోసం వెయిట్ చేస్తున్నారు. గత ఐదు నెలలుగా ఒక్క పెద్ద సినిమా ఏది విడుదల కాలేదు. ప్రేక్షకులు మూడ్ మొత్తం ఎలక్షన్ పై ఉంది. పది రోజుల క్రితమే ఎన్నికల రిజల్ట్ వచ్చేసింది. ప్రజలంతా కాదు కాదు మూవీ లవర్స్ అంతా రిలాక్స్ అయ్యారు. ఇక అందరి మూడ్ సినిమాలపైకి మళ్ళింది.
దానితో ముందుగా రాబోతున్న కల్కి చిత్రంపై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకుంటున్నారు. జూన్ 27 న రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ కావడమే కాదు.. అందరిలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రం పై బీభత్సమైన అంచనాలు పెంచుతూ వచ్చారు. ఇక నిన్న మంగళవారం కల్కి సెన్సార్ కూడా పూర్తయ్యింది. ఈ చిత్రానికి యు-ఎ సర్టిఫికెట్ ని ఇచ్చింది సెన్సార్ బోర్డు.
కల్కి చిత్రాన్ని పెద్దలు మాత్రమే కాకుండా వారి పర్యవేక్షణలో పిల్లలూ సినిమా చూడొచ్చన్నమాట. కల్కి రన్ టైం 2 గంటల 55 నిమిషాల పెద్ద నిడివితో విడుదల కాబోతోంది. విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి 2898 AD చిత్ర ప్రీమియర్స్ జూన్ 26 తోనే సన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది.