గత ఐదేళ్ళలో రోజా జగన్ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు ఎమ్యెల్యే గా ఉంటూ బయట జబర్దస్త్ షో కి జెడ్జ్ గా వచ్చేది. ఎమ్యెల్యేగా ఉంటే మాత్రం ప్రాఫెషన్ ని వదులుకోవాలా అని వాదించే రోజా.. ఆ తర్వాత మంత్రి అయ్యాక జబర్దస్త్ ని వదిలేసింది. ఆ తర్వాత రెండున్నరేళ్లు మంత్రిగా చేసింది.
మంత్రిగా నగరి ప్రజల కష్టసుఖాల కన్నా ఆమె రోజుకో చీర కట్టి, పెట్టిన నగలు పెట్టకుండా అందంగా రెడీ అయ్యి జగన్ కి భజన చెయ్యడమే పనిగా పెట్టుకుంది అనే మాట చాలామంది నోటి వెంట వినిపించింది. నగరిలో ప్రతి రోజు తిరుగుతూ తనకు తాను పబ్లిసిటీ చేసుకుంది అంటూ వైసీపీ నేతలే ఆమెకి ఎదురు తిరగడం, ప్రతిపక్షాన్ని అనరాని మాటలతో రెచ్చిపోవడంతో 2024 ఎన్నికల్లో రోజాకి ఓటమి తప్పలేదు.
ఓడిపోయాక రోజా కామ్ గా ఉంటుంది అనుకున్నారు. కానీ నెక్స్ట్ డే నే ఓ వీడియో వదిలింది. తనని ట్రోల్ చేస్తున్నారు. ఆడదాన్ని అని చూడకుండా మాట్లాడుతున్నారు. కానీ ఒక మహిళ కుటుంబం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టింది. ఇక ఈమధ్యనే మంచి చేసి ఓడిపోయాము, చేడు చేస్తే సిగ్గు పడాలి అంటూ ట్వీట్ చేసింది.
ఇక ఈరోజు ఉదయమే ఓ వీడియో షేర్ చేస్తూ ప్రతి రోజుని చిరునవ్వుతో మొదలు పెట్టి చిరునవ్వుతో ముగించాలంటూ తాను నవ్వుతున్న వీడియో ని షేర్ చేసింది. ఏంటి రోజా ఓడిపోయాక ఫిలాసఫీ చెబుతున్నావ్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రోజా మాత్రం తన కామెంట్స్ సెక్షన్ ని బ్లాక్ చేసింది.