Advertisementt

ముంబై కి ప్రభాస్

Wed 19th Jun 2024 12:21 PM
prabhas  ముంబై కి ప్రభాస్
Prabhas in Mumbai ముంబై కి ప్రభాస్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత రాత్రి ముంబైకి చేరుకున్నారు. అక్కడ ప్రభాస్ కల్కి 2898 AD ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్-దీపికా పదుకొనే, అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కలయికలో తెరకెక్కన కల్కి చిత్రం జూన్ 27 నే విడుదల కాబోతుంది. 

ఈ చిత్రం ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అన్ హ్యాపీ గా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో బుజ్జి కార్ రివీల్ ఈవెంట్ అలాగే అమరావతిలో కల్కి 2898 AD ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది అనే ప్రచారం తప్ప ఇక కల్కిప్రమోషన్స్ ఎక్కడా లేనట్టే అన్నట్టుగా కల్కి మేకర్స్ ప్రవర్తిస్తున్నారు. దానితో అభిమానుల్లో విసుగు మొదలైంది. 

అయితే ఈరోజు ముంబై లో కల్కి 2898 AD కి సంబందించిన ఓ ప్రెస్ మీట్ జరగబోతుంది. దాని కోసమే ప్రభాస్ ముంబై వెళ్లారు. మరి ఈ ప్రెస్ మీట్ లో ప్రభాస్ తో పాటుగా అమితాబ్, దిశా లు పాల్గొంటారు. ఈ ప్రెస్ మీట్ కి దీపికా అటెండ్ అవుతుందా, లేదా అనేది ఇప్పుడు క్యూరియాసిటీగా మారింది. ప్రస్తుతం కల్కి రాక కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. 

Prabhas in Mumbai :

Prabhas in Mumbai for Kalki 2898 AD promotions

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ