రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత గేమ్ చేంజర్ ని పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కానీ గేమ్ చేంజర్ విడుదలపై ఇప్పటివరకు మేకర్స్ ఓ రిలీజ్ డేట్ ని ఇవ్వలేకపోతున్నారు. అదాలా ఉంటే గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ ఉప్పెన బుచ్చి బాబు తో RC 16 కమిట్ అవడం కాదు.. పూజ కార్యక్రమాలతో సినిమా మొదలైపోయింది.
ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళని RC 16 చిత్రం పై ఇప్పుడొక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.. బుచ్చి బాబు తండ్రి మరణం తర్వాత ఆ కార్యక్రమాలు పూర్తి చేసేసి.. మళ్ళి RC 16 పై దృష్టి పెట్టారు. అయితే రామ్ చరణ్ గేమ్ చెంజర్ షూటింగ్ పూర్తి కాగానే ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారట. కారణం RC 16 కోసమే అంటున్నారు. RC 16 లో రామ్ చరణ్ చెయ్యబోయే పాత్ర కోసం కొత్త మేకోవర్ లోకి మారాల్సి ఉందట.
దానికోసం రామ్ చరణ్ ని ఆస్ట్రేలియా వెళ్లి పూర్తిగా మేకోవర్ అవ్వాలని బుచ్చిబాబు చరణ్ కి సూచించినట్లుగా తెలుస్తోంది. బుచ్చిబాబు సలహా మేరకు చరణ్ జులై లో ఆస్ట్రేలియా వెళ్లబోతున్నాడట. RC 16 లో రామ్ చరణ్ పూర్తి మాస్ అవతార్ లో కనిపిస్తాడని, ఇప్పటివరకు కనిపించని లుక్ లో రామ్ చరణ్ RC 16 లో కనిపిస్తాడని అంటున్నారు. మరి బుచ్చి బాబు చరణ్ కేరెక్టర్ కోసం ఏం ప్లాన్ చేసాడో చూద్దాం.