ప్రతి ఒక్క స్టార్ హీరో తమ తమ సినిమాలని ఏ నెలలో దించాలి, ఎప్పుడైతే కలిసొస్తుంది అని తెగ ఆలోచించేసి నిర్మాతలతో డిస్కర్స్ చేసి వెంటనే డెసిషన్ తీసేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన దేవర పాన్ ఇండియా ఫిలిం ని అక్టోబర్ 10 నుంచి OG డేట్ సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ చేయబోతున్నారనే ప్రచారం జరిగిన వెంటనే ఇమ్మిడియట్ గా పోస్టర్ తో కొత్త డేట్ ని ప్రకటించారు మేకర్స్.
ఇక గత వారం రోజులుగా అల్లు అర్జున్ పుష్ప 2 ఆగష్టు 15 కి రావడం లేదు, షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నారనే ప్రచారానికి పుష్ప మేకర్స్ ఫుల్ స్టాప్ పెడుతూ డిసెంబర్ 6 న పుష్ప 2 ఆగమనం అంటూ పోస్టర్ వేసి ప్రకటించారు. మరి రామ్ చరణ్-శంకర్ ల గేమ్ చెంజర్ రిలీజ్ డేట్ పై ఎన్ని రకాలుగా ప్రచారం జరుగుతున్నా మేకర్స్ మాత్రం మౌనం పాటిస్తున్నారు.
గేమ్ చేంజర్ అక్టోబర్ అన్నప్పటికి.. ఇప్పుడిది డిసెంబర్ మూడో వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇలా గేమ్ చేంజర్ మేకర్స్ అలోచించి ఆలోచించి ఇప్పటివరకు ఖచ్చితమైన రిలీజ్ డేట్ ఇవ్వకుండా మెగా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష అటుంచి.. ఇప్పడు గేమ్ చేంజర్ విడుదల తేదీ కామెడీ అయ్యి కూర్చుంది.