TV 9 అనే న్యూస్ ఛానల్ లో రవిప్రకాష్ నిష్క్రమణ తర్వాత అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేకించి వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తూ.. గత రెండు సంవత్సరాలుగా తనకు తోచినంత మాట్లాడారు రజినీకాంత్ అనే ఓ వ్యాఖ్యాత. అవాకులు - చవాకులు పేలారు, అభాండాలు వేశారు. విరామం లేకుండా విషం కక్కుతూనే వచ్చారు. ఒక్కసారిగా కథ మారింది. ఎన్నికల ఫలితం వచ్చింది. దట్ సో కాల్డ్ వ్యాఖ్యాతకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.
తాజాగా వినవస్తున్న కథనాల ప్రకారం సదరు ఛానల్ ఆ వ్యాఖ్యాతకి వీడ్కోలు పలికిందట. భజన చేసింది చాలు బయలుదేరు అన్నారట. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాగ్ తీసుకుని బయలుదేరిన ఈ వ్యాఖ్యాతకి ఎవరైనా స్వాగతం చెబుతారా, ఇంత కాలం ఇతను చేసిన ఆగడాలకు సాక్షిగా ఉన్నవాళ్లు తోడుగా నిలబడతారా.!