Advertisementt

కల్కి ప్రమోషన్స్ సరిపోతాయా?

Tue 18th Jun 2024 01:02 PM
kalki 2898 ad  కల్కి ప్రమోషన్స్ సరిపోతాయా?
Are Kalki promotions enough? కల్కి ప్రమోషన్స్ సరిపోతాయా?
Advertisement
Ads by CJ

కల్కి 2898 AD ప్రమోషన్స్ సరిపోతాయా నాగ్ అంటూ నాగ్ అశ్విన్ ని ప్రభాస్ ఫ్యాన్స్ క్వచ్చన్ చేస్తున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో బుజ్జి ఈవెంట్ ని గ్రాండ్ గా చేసారు. అది చూసి దేశమంతా థ్రిల్ అయ్యింది. బుజ్జి ఎక్కడ కనిపిస్తే అక్కడ కల్కి కల్కి అంటూ ప్రేక్షకులు సందడి చేసారు. ఇప్పుడు కల్కి మరో ఈవెంట్ అమరావతిలో ఉంటుంది అనే టాక్ ఉంది.

దానికి చంద్రబాబు, పవన్ లాంటి వాళ్ళు హాజరవుతారని అంటున్నా.. ఇప్పటివరకు దానికి అనుగుణంగా ఎలాంటి పనులు మొదలు కాలేదు. మరోపక్క కల్కి విడుదలకు సమయం దగ్గరపడుతోంది. జూన్ 27 న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కల్కి ప్రీమియర్స్ కి ఇంకా 9 రోజులే అంటూ మేకర్స్ కౌన్ డౌన్ పోస్టర్స్ వదులుతున్నారు.

కానీ ముంబై, బెంగుళూరు, చెన్నై ఇలా కొన్ని ప్లేసెస్ లో కల్కి ఈవెంట్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసారు చాలామంది. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఒక్క బుజ్జి ఈవెంట్ తోనే సరిపెట్టేసాడు. ఇప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల కోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు తప్ప మరో నగరంలో కల్కి ఈవెంట్ ప్లాన్ చేయకపోవడంతో.. ఈ కల్కి ప్రమోషన్స్ సరిపోతాయనుకుంటున్నారా అంటూ మేకర్స్ ని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. 

Are Kalki promotions enough?:

Criticisms on Kalki 2898 AD promotions

Tags:   KALKI 2898 AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ