అవును.. మీరు వింటున్నది నిజమే.. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు పెద్దలు గవర్నర్లు కాబోతున్నారు..! ఎందుకంటే.. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారడంతో గవర్నర్ పదవులు దక్కబోతున్నాయని సమాచారం. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు..? చంద్రబాబు మనసులో ఉన్నదెవరు..? బీజేపీ నుంచి గవర్నర్ గిరిపై మనసు పడింది ఎవరికి..? ఒక్క ఆంధ్రా మాత్రమేనా తెలంగాణ నుంచి కూడా ఎవరైనా ఉన్నారా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
ఎవరా పెద్దలు..?
ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు ఏం చెప్పినా.. ఏం చేయాలనుకున్నా, చేసినా అది అక్షరాలా నడుస్తుంది. ఎందుకంటే కేంద్రంలో మోదీ సర్కార్ నిలబడాలంటే సర్వం చంద్రబాబే మరి. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ జుట్టు బాబు చేతిలో ఉందన్న మాట. అందుకే ఇప్పటికే కేంద్రంలో రెండు మంత్రి పదవులు దక్కుంచుకున్న టీడీపీ.. త్వరలో ఇద్దరు గవర్నర్లను కూడా కావలసిందేనని డిమాండ్ చేయబోతున్నారని తెలిసింది. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. ఒకరు సీనియర్ నేత అశోక్ గజతిరాజు కాదా.. మరొకరు యనమల రామకృష్ణుడు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఇద్దరి పేర్లను చంద్రబాబు పరిశీలించి ఫైనల్ చేసినట్టుగా సమాచారం. ఈ మధ్యే చంద్రబాబుతో యనమల భేటీ కాగా ఈ విషయం చెప్పారని తెలిసింది.
ఇంకొకరు ఎవరబ్బా..?
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు గవర్నర్ కాబోతున్నారని రెండ్రోజులుగా ఒక్కటే చర్చ జరుగుతోంది. ఈయనపై మోదీ, షాలకు ఉన్న నమ్మకం.. సీనియారిటీ, అనుభవం అన్నీ కలిసి రావడంతో కిరణ్ కాబోయే గవర్నర్ అని వార్తలు గుప్పంటున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అస్త్రం దొరికినట్టే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. అసలే రాజకీయంగా ఏమేమి అవకాశాలు దొరుకుతాయా..? అని గులాబి పార్టీ ఎదురు చూపుల్లో ఉంది. తెలంగాణపై ఆంధ్రుల పెత్తనం అని.. సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు చిల్లి గవ్వ కూడా ఇవ్వనని కిరణ్ చెప్పిన విషయాలన్ని గులాబి నేతలు తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ఒక ఉద్యమం చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూశారుగా ఇదీ ఏపీ నుంచి గవర్నర్లు అయ్యే ఛాన్స్ ఉన్న వ్యక్తుల కథ. ఇక కమలనాథుల మనసులో ఏముంది..? ఎవరెవరిని గవర్నర్ గిరి వరిస్తుందో..? చూడాలి మరి.