గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు విడుదల తేదీ ప్రకటిస్తారా అని మెగా అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. శంకర్ కానీ, దిల్ రాజు కానీ రామ్ చరణ్ కానీ గేమ్ చేంజర్ విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. శంకర్ ఇండియన్ 2 రిలీజ్ చేసే కానీ గేమ్ చేంజర్ పై దృష్టి పెట్టలేరు.
ఇక దిల్ రాజు, రామ్ చరణ్ లు గేమ్ చేంజర్ ని అక్టోబర్ లో తీసుకొస్తాం అంటూ చెబుతున్నారు. ఇప్పుడు దేవర అక్టోబర్ నుంచి తప్పుకుంది ఆ డేట్ కి గేమ్ చెంజర్ వస్తే బావుంటుంది అనిమేగా అభిమానులు కోరుకుంటుంటే.. మరొకసారి మెగా అభిమానులకి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. కారణం గేమ్ చేంజర్ ఆక్టోబర్లో వచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు.
దర్శకుడు శంకర్ ఓకె అంటే గనక డిసెంబర్ లో అందులోను క్రిష్టమస్ బరిలో గేమ్ చేంజర్ ని దించాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలతో మెగా అభిమానులు ఢీలా పడిపోతున్నారు. దసరా తప్పితే మళ్లీ కృష్టమస్ తప్ప మంచి ఛాన్స్ రాదు. అదే దిల్ రాజు ఆలోచన. మరి శంకర్ ఏమంటారో చూడాలి.