తాను ఏంతో కష్టపడి నటించిన సినిమాకి ప్లాప్ టాక్ వస్తే రెండు మూడు రోజులు గదిలో నుంచి బయటికి రాను.. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అని సూపర్ స్టార్ మహేష్ చెబితే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తన సినిమా ఏదైనా బాలేదు, బాగా ఆడదు అంటే పార్టీ చేసుకుంటాను, దానితో రిలాక్స్ అవుతాను అంటూ చెప్పడం చాలామందికి షాకిచ్చింది.
తండ్రి మెగాస్టార్ వారసత్వాన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఏదైనా ఒత్తిడికి లోనయ్యారా అని అడిగితే.. లేదండి అలాంటిదేమి లేదు. అసలు ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. కెరీర్ విషయానికి వస్తే నేను నటించిన సినిమా విడుదలై బాలేదు, బాగా ఆడదు అనే టాక్ వస్తే.. రిలాక్స్ అవ్వడానికి పార్టీ చేసుకుంటాను.
అంతెందుకు ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తర్వాత వారం రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలేదు, పార్టీ చేసుకున్నాను, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాను. సక్సెస్, ఫెయిల్యూర్ గురించి పెద్దగా ఆలోచించను. ఇప్పుడేం జరుగుతుంది అనేది ఆలోచిస్తాను, రేపేమి జరగబోతుంది అనేది అంతగా పట్టించుకోను అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.