Advertisementt

పెళ్లి-విడాకులపై సదా సెన్సేషనల్ కామెంట్స్

Mon 17th Jun 2024 01:30 PM
sada  పెళ్లి-విడాకులపై సదా సెన్సేషనల్ కామెంట్స్
Sada comments on marriage and divorce పెళ్లి-విడాకులపై సదా సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

అపరిచితుడు, జయం చిత్రాలతో హీరోయిన్ గా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీస్ లో పేరు తెచ్చుకున్న సదా కి ఆ తర్వాత బ్రేకిచ్చే హీరోలు తగల్లేదు, కెరీర్ లో దూసుకుపోయే చిత్రాలు ఆమె చెంతకు చేరలేదు. ప్రస్తుతం సినిమాలేవీ చెయ్యని సదా ఈమధ్యన ఆదికేశవ చిత్రంలో నటించింది. ఆ చిత్రం డిసాస్టర్ అవ్వడంతో సదా కి పేరు రాకుండా పోయింది. 

ఇక ఎలాంటి ప్రాజెక్ట్స్ లో నటించని సదా ప్రెజెంట్  స్టార్ మా లో నీతోనే డాన్స్ సీజన్ 2 కి జెడ్జ్ గా వస్తుంది. ఇప్పటికీ గ్లామర్ చూపించడంలో వెనక్కి తగ్గని సదా పెళ్లి విషయంలో మాత్రం ఎందుకో తెగ ఆలోచిస్తుంది. అయితే సదా ప్రస్తుతం పెళ్లి పై అలాగే విడాకులపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పెళ్లి పై నాకు గౌరవం ఉంది. అయితే ఇంతవరకూ నా హృదయానికి ఎవరూ దగ్గర అవ్వలేదు. 

నాకు ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను ఖచ్చితంగా ప్రేమ పెళ్ళే చేసుకుంటాను. పెద్దలు కుదిర్చిన వివాహం మాత్రం చేసుకోను. నేను దానికి వ్యతిరేఖం. అంతేకాదు పెళ్లి తర్వాత భాగస్వామిని భరించడం కష్టం అనిపిస్తే.. విడాకులు తీసుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఇబ్బందులు పడుతూ కాపురం చేయాల్సిన అవసరం లేదు కదా అంటూ సదా పెళ్లిపై, విడాకులపై తన మనసులోని మాటని బయటపెట్టింది. 

Sada comments on marriage and divorce:

Sada Sensational statement on marriage and divorce

Tags:   SADA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ