Advertisementt

కరుణించనున్న పవన్ కళ్యాణ్

Mon 17th Jun 2024 12:14 PM
pawan kalyan  కరుణించనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan who will be compassionate కరుణించనున్న పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటంలో గెలిచి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పలు శాఖల బాధ్యతలు తీసుకున్నారు. ఇదంతా జనసైనికులకి, ఆయన అభిమానులకి, మెగా ఫ్యామిలీకి ఏంతో సంతోషపెట్టే విషయమే. కానీ ఆయనతో సినిమాలు చేస్తున్ననిర్మాతలకే కంటి మీదకి కునుకు రానివ్వడం లేదు. 

పవన్ కళ్యాణ్ గెలవాలని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కానీ గెలిచాక పవన్ కళ్యాణ్ కి  కొత్త ప్రభుత్వంలో ఇంత ఇంపోర్టన్స్ ఉంటుంది అని వాళ్ళు నిజంగా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఇప్పుడు పవన్ కి ఏపీ ప్రభుత్వంలో ఉన్న ప్రయారిటీకి వాళ్ళు సంతోషపడాలో, సెట్స్ మీదున్న సినిమాలు చూసుకుని టెన్షన్ పడాలో అర్ధం కానీ సంకటస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

బోలెడంత బడ్జెట్ తో పవన్ తో సినిమాలు స్టార్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు, OG చిత్రాల నిర్మాతలు పవన్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. రమ్మని అడగలేరు, అలాగని చూస్తూ ఉండలేరు. ఇది పవన్ కళ్యాణ్ తో పని చేసే నిర్మాతల పరిస్థితి. అయితే ఈరోజు సోమవారం తన పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అటు సినిమాలని పూర్తి చేసేయాలని అనుకుంటున్నారట. 

మూడు చిత్రాల కోసం పవన్ కళ్యాణ్ తన డేట్స్ ను సర్దుబాటు చేసుకోనున్నారని తెలుస్తోంది. తొందరలోనే తన చిత్ర నిర్మాతలను కలిసి, తన కాల్షీట్ల గురించి చర్చించే అవకాశం ఉందని సమాచారం. OG, ఉస్తాద్, వీరమల్లు చిత్రాల కోసం రెండు నెలల సమయం కేటాయించి వాటిని ఫినిష్ చేసేసి ఇకపై, తదుపరి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండాలని పవన్ డిసైడ్ అయినట్లుగా టాక్. 

Pawan Kalyan who will be compassionate:

Pawan Kalyan to meet producers to chalk out future course

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ