జగన్ ఇంటి ముందు కూల్చివేతలు.. ఎన్ని ట్విస్టులో!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదారాబాద్ లోని లోటస్ పాండ్ లో పెద్ద భవనంపై తెలంగాణ మంత్రి కన్ను పడిందా..? జగన్ ప్రస్తుతం ఆంధ్రాలో ఉండటంతో ఒకసారి టచ్ చేస్తే పోలా అంటూ ఆ మంత్రి మూడో కంటికి తెలియకుండా ఒక చూపు చూద్దామని అనుకున్నారా..? అది కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఈ పని చేశారా..? అంటే ఇవన్నీ వందకు వెయ్యి శాతం అక్షరాలా నిజం అనిపిస్తోంది. ఇంతకీ ఎవరు ఆ మంత్రి..? ఏం జరుగుతోంది..? ఇంతకీ ఎందుకు ఇంత రచ్చ చేశారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
ఇదీ అసలు సంగతి..?
ఒకటి రెండు కాదు కొన్నేళ్ల కిందటే లోటస్ పాండ్ లో వైఎస్ ఫ్యామిలీ ఇల్లు కట్టుకుంది. నాడు ఎంత అధికారంలో ఉన్నప్పటికీ కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు కట్టి ఉంటారు.. ఎందుకంటే అది తాత్కాలికం కాదు శాశ్వతమని కట్టడం గనుక..! అలాంటిది ఇన్నాళ్లు లేని అక్రమ కట్టడాలు ఇప్పుడు ఎందుకు.. ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎందుకు ఇప్పుడే కూల్చాల్సి వచ్చింది..? అది కూడా GHMC ఉన్నతాధికారులకు తెలియకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేసారు..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
రేవంత్ రెడ్డికే తెలియదా..?
జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా..? అవును అస్సలు తెలియనే తెలియదట. ఇలా కూల్చివేతలు జరుగుతున్నాయని టీవీల్లో చూసే తెలుసుకున్నారట. అంటే సదరు మంత్రి ఎంతలా ప్లాన్ చేశారో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఆ మంత్రి ఎవరా అని ఆరా తీస్తే.. వైఎస్ జగన్ ఇంటి దగ్గర నివాసముండే కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకి చెందిన ఒక కీలక మంత్రి అని తెలిసింది. ఆ మంత్రి నుంచి జీహెచ్ఎంసీ అధికారికి మౌలిక ఆదేశాలు జారీ చేయడంతో కూల్చివేత జరిగిందని, ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని ఆ అధికారిని మరుసటి రోజే బదిలీ చేయడం జరిగింది. చూసారా.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో!
ఎవరు ఆ మంత్రి..?
ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ప్రహారి కూల్చివేతపై కనీసం సమాచారం కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ పోలీస్ ఉన్నతాధికారులకు లేదని ఏకంగా సీఎంవో నుంచి లీకులు రావడం గమనార్హం. ఇదంతా పెద్ద జోక్ అని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్న పరిస్థితి. ఒకవేళ ఇదే నిజమైతే జగన్ ఇంటి దగ్గర నివాసముండేది.. కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకు చెందిన కీలక మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులే. ఈ ఇద్దరిలో జగన్ ఇంటి ప్రహరీ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అన్నది అంతు చిక్కడం లేదు.
ఎవరికేం అవసరం..?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్ఆర్ శిష్యుడు, వైఎస్ జగన్‌కు ఆప్తమిత్రుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా చెప్పారు. జగన్ సీఎం కావాలని కూడా గట్టిగా కోరుకున్నారు. సో.. ఈయనకి అంత అవసరమా అంటే అస్సలు లేదు. ఇక మిగిలింది తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే. సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా మాజీ సీఎం ఇంటి మీదకి వెళ్ళమని అధికారులను చెప్పే అంత ధైర్యం తుమ్మల చేశారా అంటే ఆలోచించాల్సిన విషయమే అని సొంత పార్టీ నేతలే అనుమానిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే సీఎంకి తెలియకుండా మంత్రులు ఇంత పని చేస్తున్నారంటే రేవంత్ పని తీరుపై కూడా విమర్శలు వస్తాయి.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
అవునా.. నిజమేనా..?
ఈ కూల్చివేతలపై తెలంగాణ కాంగ్రెస్, మంత్రివర్గంలో పెద్ద గొడవలే జరుగుతున్నాయి అని టాక్. ఇదంతా రేవంత్ రెడ్డికి తెలిసే జరిగిందని కొందరు.. అబ్బే ఆయనకేని తెలియదని మరికొందరు అంటున్నారట. అంతే కాదు మంత్రులు రెండుగా చీలిపోయి రచ్చ రచ్చే చేస్తున్నారు అని తెలుస్తోంది. ఈ ఉందంతం వల్ల తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో తనకి తెలియకుండానే ఇదంతా జరిగిందని చెప్పి ఓ అధికారిని బదిలీ చేసి దులుపుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే తప్పు జరిగిందని.. ఆ నిర్మాణాలు అక్రమమైనవి కాదని ఒప్పుకున్నట్టేనా అని వైసీపీ నేతలు నిలదీస్తున్న పరిస్థితి. ఇందులో నిజానిజాలు ఏంటో..? దీనిపై మంత్రులు, అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి.