చంద్రబాబు నాయుడు గనక కుప్పం లో గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, అంతేకాదు ఆడి బూట్లు కూడా తుడవడానికి రెడీ అంటూ గుడివాడ మాజీ ఎమ్యెల్యే కొడాలి నాని మంత్రి పదవిలో ఉన్నప్పుడు కూసిన కూతలకు ఇప్పుడు సోషల్ మీడియాలో బలైపోతున్నాడు. 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాక కోడాలి నాని పై ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
బుద్ధా వెంకన్న లాంటోళ్ళు ఎప్పుడొస్తున్నావ్ మా చంద్రబాబు బూట్లు తుడవడానికి అంటూ నానా రచ్చ చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు, లోకేష్ లపై అతి దారుణంగా మాట్లాడిన కోడాలి నాని ఇంటి పై టీడీపీ కార్యకర్తలు గుడ్లు, రాళ్ళూ వేస్తూ రెచ్చిపోయారు. కొడాలి ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టేలా తయారయ్యారు.
ఇప్పుడు గుడివాడ లో కొడాలి నాని చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తున్నట్టుగా బ్యానర్ లు వెలిసాయి. చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని కొడాలి నాని ఆయన షూస్ తుడుస్తున్నట్టుగా బ్యానర్లు ఏర్పాటు చేసి బాబు గారి షూ తుడుస్తా అన్న పిరికిపందా ఎక్కడా అంటూ టీడీపీ కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటు చేసారు.. అది చూసి అయ్యో కొడాలి ఎంత కామెడీ గా ఉన్నావంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.