జగన్ ప్రభుత్వానికి ఏదైతే ప్లస్ అవుతుంది అని జగన్ నమ్మాడో అదే వాలంటీర్ వ్యవస్థ జగన్ ప్రభుత్వ పతనానికి కారణమైంది అంటూ పలువురు వైసీపీ నేతలు చెప్పడం గమనార్హం.. జగన్ కి వాలంటీర్ల మీదున్న నమ్మకం కేడర్ మీద లేదు, కార్యకర్తలని జగన్ పక్కనపెట్టి వాలంటీర్లని నమ్ముకుని ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారంటూ జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారే వాపోతున్నారు.
ఎలక్షన్ కోడ్ కారణంగా ఏప్రిల్ 1 న వాలంటీర్లని ఇళ్ళకి వెళ్లకుండా ఈసీ అడ్డుకట్ట వేస్తె చంద్రబాబే చేయించారంటూ వైసీపీ నేతలు, జగన్ పదే పదే చెప్పినా ప్రజలు పట్టించుకోలేదు. అయితే ఈ రాజకీయంలో భాగంగా పలువురు వాలంటీర్లు తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి వైసీపీ పార్టీ వెంట నడిచారు. అంతకుముందే వాలంటీర్ల చేత ప్రజలని భయపెట్టి ఓట్లు వేసే ప్లాన్ వైసీపీ చేసింది అని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఇక టీడీపీ వాళ్ళు చేసిన పని వల్లే వాలంటీర్లు ఉద్యోగాలకి రాజీనామా చేసి వైసీపీ వెంట నడుస్తున్నారంటూ వైసీపీ వాళ్ళు డబ్బా కొట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారన్న ప్రచారం వైసీపీ చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు తాము వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాల్ని డబుల్ చేస్తామని.. రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
అయినప్పటికీ వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలకి ప్రభావితమై పలువురు వాలంటీర్లు తమ ఊద్యోగాలు వదులుకుని వైసీపీ పార్టీ కి ప్రచారం చేసారు. కానీ తాజాగా వాలంటీర్లు లోని చాలామంది మేము వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు విని రాజీనామా చేసి నిండా ముంగిపోయామంటూ ఘొల్లుమంటున్నారు.
తమపై ఒత్తిడి తీసుకురావటం, భయపెట్టి రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. చాలా చోట్ల మహిళా వాలంటీర్లు పెద్ద ఎత్తున ఎమ్యెల్యేలని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.