2024 కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబు సీఎం గా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారాలు చెయ్యడమే కాదు.. చంద్రబాబు తన క్యాబినెట్ లోకి చాలామంది కొత్త వాళ్ళనే మంత్రులుగా తీసుకున్నారు. తెలిసిన మొహాలు చాలా తక్కువ. అందులోను సీనియర్స్ ని పక్కనబెట్టి చంద్రబాబు యువ రక్తానికి ఛాన్స్ ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేతలు బాబు పై అలకపూనారంటూ బ్లూ మీడియా వార్తలు వండి వారుస్తుంది.
కానీ టీడీపీ సీనియర్ నేతలెవరూ చంద్రబాబు పై అలకబూనటం కానీ, పల్లెత్తు మాట అనడం కానీ చెయ్యడం లేదు. గత ప్రభుత్వంలో ఏంతో కష్టనష్టాలు అనుభవించిన అయ్యన్నపాత్రుడు, యనమల, గోరంట్ల వీళ్లంతా చంద్రబాబు పై కత్తి కట్టారంటూ మాట్లాడారు. కానీ అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు వీళ్లంతా చంద్రబాబు కి సపోర్టుగా నిలుస్తున్నారు.
అయ్యన్నపాత్రుడు తనకి మంత్రి పదవి రాలేదనే నిరాశ లేదు, చంద్రబాబు యువ ఎమ్యెల్యేలకి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది. నాకు 26 ఏళ్లకే మంత్రి పదవి అవకాశం ఇచ్చారు. అప్పుడు సీనియర్స్ నాకు సపోర్ట్ చేసినట్టుగానే నేను ఇప్పుడు ఈ మంత్రులకి సపోర్ట్ చేస్తా అన్నారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు కూడా సమాజం లో మార్పు కోసం ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు అనుగుణం గానే కేబినెట్ ఉండాల్సిన అవసరం ఉంది.
యువతకు ప్రాధాన్యం ఉండాలి వారికి స్థానం కల్పిస్తేనే ఆ పార్టీ, ప్రభుత్వం కానీ నాలుగు కాలాల పాటు ఉంటుంది. ఎన్టీఆర్ నాకు 29 ఏళ్ల కె అవకాశం ఇచ్చారు. ప్రస్తుత కేబినెట్ కూర్పు వంద శాతం బాగుంది. దాన్ని స్వాగతీస్తున్నాం. పార్టీలో సీనియర్ లు పార్టీకి ఉపయోగపడాలి, జూనియర్ లకు అవకాశాలు కల్పించాలి. అప్పుడే యువత ఎదుగుతారు. పాత నీరు కొత్త నీరు కలయిక ఎప్పుడూ ఉంటుంది. అప్పుడే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది.. అంటూ తానేమి చంద్రబాబు పై అలగలేదు అని స్పష్టం చేసారు.