అల్లు అర్జున్-సుకుమార్-మైత్రి మూవీ మేకర్స్ అందరూ పుష్ప ద రూల్ చిత్రం ఆగష్టు 15 నే రాబోతుంది అంటూ పదే పదే పోస్టర్స్ తో ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చేస్తే ఆగష్టు 15 కి పుష్ప 2 రాకపోవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
ప్రస్తుతం సుకుమార్ రామోజీ ఫిలిం సిటీలో డే అండ్ నైట్ పుష్ప షూటింగ్ కోసం కష్టపడుతున్నారు. నిన్నమొన్నటివరకు కీలక నటుల డేట్స్ దొరక్క.. ఇప్పుడు టెక్నీకల్ టీం నుంచి ఒకరు బయటికెళ్లిపోవడం అన్నీ ఒకదాని మీద ఒకటి ఇబ్బందులు తలెత్తాయి. అన్ని కొలిక్కి వచ్చి ఇపుడు షూటింగ్ సజావుగా సాగుతున్నా అది ఆగష్టు వరకు పట్టేలా కనబడుతుంది.
దానితో మేకర్స్.. సినిమా రిలీజ్ ను వాయిదా వేయడం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఆగష్టు లో షూటింగ్ పూర్తయ్యాక.. ఎడిటింగ్ వర్క్ జరగాలి. ఆ తర్వాత అన్ని భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలి.. వీటన్నిటికీ నాలుగైదు నెలల సమయం కావాలి. అందుకే ఆగష్టు నుంచి పుష్ప 2 ని పోస్ట్ పోన్ చేసి పుష్ప 1 మాదిరి డిసెంబర్ లోనే విడుదల చేస్తే బావుంటుంది అని మేకర్స్ ఆలోచన చేస్తున్నారట.
మరి దీని బట్టి పుష్ప 2 ఖచ్చితంగా ఆగష్టు 15 కి రావడం లేదు అని తెలుస్తుంది. మరి ఆ విషయమేదో మేకర్స్ ప్రకటిస్తే అల్లు ఫాన్స్ టెన్షన్ పడరు. లేదంటే ఈ వార్తలు ఆగేలా కనిపించడం లేదు.