నిన్న శుక్రవారం విడుదలైన చాలా సినిమాల్లో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా తో పాటుగా విజయ్ సేతుపతి మహారాజ చిత్రాలకి క్రిటిక్స్ నుంచి బెస్ట్ రివ్యూస్ వచ్చాయి. ఆడియన్స్ కూడా ఈ రెండు సినిమాలు బావున్నాయంటూ ఇస్తున్న టాక్ చూస్తే థియేటర్స్ కి వెళ్లాలనే ఊపు వచ్చినా జనాలు మాత్రం థియేటర్స్ కి కదలడం లేదు.
ఇక అదే రోజు విడుదలైన సుధీర్ బాబు హరోం హర కి కూడా మిక్స్డ్ టాక్ రావడం మ్యూజిక్ షాప్ మూర్తి కి ఎఫెక్ట్ అయ్యింది. అజయ్ ఘోష్ ని ఎక్కువుగా సపోర్టింగ్ రోల్స్ లో చూసి చూసి ఇప్పుడు ఆయన కీలక పాత్రలో సినిమా అనేసరికి అందరూ లైట్ తీసుకుంటున్నారు. కంటెంట్ బావుంది అంటున్నా అజయ్ ఘోష్ ని అంతసేపు ఏం చూస్తామనే భావన చాలామందిలో వచ్చేసింది.
ఇక కొన్ని నెలలుగా బాక్సాఫీసు నిస్తేజంగా ఉండడంతో ఆడియన్స్ లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప సినిమాలు చూసే మూడ్ రావడం లేదు. అందుకే సుధీర్ బాబు హరోం హర కి, విజయ్ సేతుపతి మహారాజాకి గుడ్ రెస్పాన్స్ వచ్చినా థియేటర్స్ కి వెళ్లే మూడ్ రావడం లేదు ప్రేక్షకులకి.
మరి చాలా రోజుల తర్వాత బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సినిమాలకి కలెక్షన్స్ విషయంలో కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. అందుకే అనేది పాజిటివ్ టాక్ వచ్చినా ఫలితం లేదు అనేది.!