Advertisementt

గేమ్ చేంజర్ అక్టోబర్ 10 అయితే..!

Sat 15th Jun 2024 10:30 AM
game changer  గేమ్ చేంజర్ అక్టోబర్ 10 అయితే..!
Game Changer October 10 though..! గేమ్ చేంజర్ అక్టోబర్ 10 అయితే..!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-శంకర్ కాంబోలో గత మూడేళ్ళుగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రానికి మోక్షం ఎప్పుడు అంటూ మెగా అభిమానులు ఆందోళన పడని రోజు లేదు. అక్టోబర్ రిలీజ్ అంటూ నిర్మాత దిల్ రాజు దగ్గర నుంచి హీరో రామ్ చరణ్ వరకు చెబుతూ వస్తున్నారు. కానీ ఆ డేట్ లాక్ చెయ్యడం లేదు. దానితో మెగా ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు.

తాజగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర అక్టోబర్ 10 నుంచి తప్పుకుని ఇంకాస్త ముందుగా అంటే సెప్టెంబర్లోనే విడుదలకి రెడీ అయ్యింది. సెప్టెంబర్ 27 న దేవర వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. దానితో మెగా ఫ్యాన్స్ లో ఉత్సుకత మొదలయ్యింది. అక్టోబర్ 10 డేట్ ని గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ ఆక్యుపై చేస్తే బావుంటుంది అని వారి కోరిక.

మరి దిల్ రాజు-శంకర్ ఆ అక్టోబర్ 10 డేట్ పై కాస్త ఆలోచిస్తే బెటర్ ఏమో. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 రిలీజ్ పనుల్లో ఉన్నారు. ఈ చిత్రం జులై లో విడుదల కాబోతుంది. ఇక రామ్ చరణ్ కూడా వైజాగ్ లో గేమ్ చేంజర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. బాబాయ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గేమ్ చేంజర్ షూటింగ్ కోసం చరణ్ తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాడు. 

Game Changer October 10 though..!:

Is Game Changer releasing in October?

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ