Advertisementt

సైలెంట్ గా దించేసాడు దిల్ రాజు

Fri 14th Jun 2024 08:11 PM
love me  సైలెంట్ గా దించేసాడు దిల్ రాజు
Dil Raju was silent సైలెంట్ గా దించేసాడు దిల్ రాజు
Advertisement
Ads by CJ

ఫ్యామిలీ స్టార్, లవ్ చిత్రాలతో వరసగా డిస్పాయింట్ మోడ్ లో ఉన్న దిల్ రాజు ప్రస్తుతం లాంగ్ వెకేషన్ అంటూ భార్య తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. భార్య తో కలిసి సరదాగా షికార్లు చెయ్యడమే కాదు.. యువకుడిలా కలరింగ్ ఇస్తున్నారు. 

ఇక దిల్ రాజు బ్యానర్ నుంచి తన సోదరుడు కొడుకు ఆశిష్ నటించిన లవ్ మీ చిత్రం గత నెలలో విడుదలై మేకర్స్ ని డిజ్ పాయింట్ చేసింది. హీరో ఆశిష్‌, బేబీ ఫేం వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్‌ మీ.. ఇఫ్‌ యు డేర్‌ అంటూ రొమాంటిక్ హారర్‌ థ్రిల్లర్‌ గా థియేటర్స్ లో విడుదలైంది. 

థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ చిత్రాన్ని దిల్ రాజు గారు సైలెంట్ గా ఓటీటీ లో దించేసాడు. హంగామా లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో లవ్ మీ చిత్రం కామ్ గా స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ఓటీటీ విడుదల పై ఎటువంటి సమాచారం లేకుండానే చప్పుడు కాకుండా స్ట్రీమింగ్ కి రావడంతో దిల్ రాజు డెసిషన్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Dil Raju was silent:

Love Me If You Dare is available on Amazon Prime Video

Tags:   LOVE ME
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ