Advertisementt

ప్రెస్ మీట్ పెట్టాడు.. కామెడీ అయ్యాడు

Fri 14th Jun 2024 06:57 PM
jagan  ప్రెస్ మీట్ పెట్టాడు.. కామెడీ అయ్యాడు
He held a press meet.. He became a comedy ప్రెస్ మీట్ పెట్టాడు.. కామెడీ అయ్యాడు
Advertisement
Ads by CJ

2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తర్వాత ఓటమికి కారణాలను తెలుసుకునేందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మాజీ మంత్రులు, మాజీ ఎమ్యెల్యేలతో మీటింగ్స్ పెట్టాడు. అసలు వైసీపీ ఓటమికి కారణాలేమిటో అని వాళ్లతో చర్చించాడు. రెండుమూడు రోజులుగా కారణాలను తెలుసుకున్న జగన్ నిన్న మీడియా ముందుకు వచ్ఛాడు.

రావడం రావడమే 2019 లో గెలిచాం.. కళ్ళు మూసుకుంటే ఐదేళ్లు గడిచిపోయాయి, ఇప్పుడు మరో ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే 2029 వచ్చేస్తుంది.. అంటూ ఉపన్యాసం మొదలు పెట్టాడు. అంతేకాకుండా గత ఐదేళ్లుగా ప్రత్యేక హోదా ఊసెత్తని జగన్ కొత్తగా ప్రత్యేక హోదా రాగమందుకున్నాడు. చంద్రబాబు బిజెపి తో కలిసి ప్రభుత్వం ఏరాటు చేసాడు.

అక్కడ కేంద్రంలో బీజేపీ కి ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు రాలేదు. దానితో చంద్రబాబు దిక్కయ్యాడు. చంద్రబాబు కి బీజేపీ ప్రభుత్వంలో అంత ఇంపోర్టెన్స్ ఉంటే ఆయన ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు. అదే టీడీపీ చేసిన మొదటి పాపం.. పాపాలు పండుతాయి. అప్పుడు పోరాడుదామంటూ ఏవేవో చెప్పుకొచ్చాడు. జగన్ అలా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కామెడీ అయ్యాడు.

 కారణం గత ఐదేళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడగని సుద్దపూస ఈరోజు నిద్రలేచి చంద్రబాబు అడగాలంటున్నాడు, మరి ఈ ఐదేళ్లు నిద్రపోయావా.. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి, గురకపెట్టి పడుకుంటే 10 ఏళ్ళు అయిపోతాయి, ముసుగు తన్ని పడుకుంటే ముప్పై ఏళ్లు అయిపోతాయి అనుకునే బాధ్యతా రాహిత్య రాజకీయ పార్టీ మీదేనేమో రాజకీయ చరిత్రలో అంటూ వైసీపీ ని జగన్ ని నెటిజెన్స్ కామెడీగా ఆడుకుంటున్నారు. 

He held a press meet.. He became a comedy:

Jagan press meet about TDP papalu 

Tags:   JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ