Advertisementt

కనురెప్ప పడనివ్వని కన్నప్ప టీజర్

Fri 14th Jun 2024 05:35 PM
kannappa  కనురెప్ప పడనివ్వని కన్నప్ప టీజర్
Kannappa Teaser Review కనురెప్ప పడనివ్వని కన్నప్ప టీజర్
Advertisement
Ads by CJ

మంచు విష్ణు గత కొద్దిరోజులుగా కన్నప్ప చిత్రం పై పెంచుతున్న హైప్ అంతా ఇంతా కాదు. పలు భాషల ఇండస్ట్రీల నుంచి టాప్ యాక్టర్స్ ని కన్నప్పలో భాగం చెయ్యడంతో ఈప్రాజెక్టు పై పాన్ ఇండియా లెవల్లో అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కన్నడ శివ రాజ్ కుమార్, మలయాళ మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఇలా ప్రతి ఒక్క పేరు ఈ సినిమాపై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసింది. 

ప్రభాస్ అన్న ఒక కట్ చూసి ఇదేదో గట్టిగా కొట్టేలా ఉంది అన్నాడు అంటూ మంచు విష్ణు నేడు టీజర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పడం చూసిన వారు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు.. కన్నప్పతో గట్టిగానే కొట్టేలా ఉన్నారు అని మాట్లాడుకుంటున్నారు. తాజాగా విడుదలైన కన్నప్ప టీజర్ లోకి వెళితే.. అదిరిపోయే విజువల్స్, అతిధి పాత్రాలు చేసిన స్టార్స్ కనిపించి కనిపించకుండా కనువిందు చేసారు. 

సినీ ప్రియులకు కన్నప్పతో విజువల్ ట్రీట్ మాత్రం పక్కా అనిపిస్తుంది. అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించగా.. మొదటి నుంచి ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరిగినట్టుగానే ప్రభాస్ కళ్లను చూపిస్తూ ఓ షాట్ వేసారు. మోహన్ లాల్ ని సైడ్ లుక్ లో చూపించారు. కన్నప్ప వీరుడిగా కనిపించనున్నాడు. యాక్షన్ సీన్స్, గ్రాండ్ విజువల్ తో కన్నప్ప టీజర్ అదిరిపోయింది. 

సినిమాటోగ్రఫీ, పాత్రల తీరు తెన్నులు, ప్రతి సీన్ రిచ్ గా కనిపించేందుకు మేకర్స్ పెట్టిన ప్రతి పైసా కన్నప్ప పై మరింత క్రేజ్ ని పెంచేలా ఉన్నాయి. 

Kannappa Teaser Review:

Manchu Vishnu Kannappa Teaser Released 

Tags:   KANNAPPA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ