అవును.. అనుకున్నట్లే ఊహించని రీతిలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖల కేటాయింపులు జరిగాయి. వాస్తవానికి కీలక శాఖలు దక్కించుకున్న మంత్రులు కూడా బహుశా కలలో కూడా ఊహించి ఉండరేమో..! ఎవరి అంచనాలకు అందకుండా మంత్రులకు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖలు ఇచ్చారు. పొంగూరు నారాయణ, నారా లోకేష్ లకు మాత్రం గత మంత్రివర్గంలో ఉన్న శాఖలనే కేటాయించడం జరిగింది. ఇక ఆర్థిక శాఖ ఐతే.. సరిగ్గా సెట్ అయ్యే, అన్నీ విధాలుగా అర్హత ఉన్న, లెక్కల మాస్టర్ అని టీడీపీ పిలుచుకునే వ్యక్తికే ఇవ్వడం జరిగింది.
పవన్ కోరుకున్నట్టే!
ఇక కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించి, కింగ్ మేకర్ అయిన పవన్ కళ్యాణ్ కు కోరిన, కోరుకున్న శాఖలు దక్కాయి అని చెప్పుకోవచ్చు. ముందు నుంచీ అనుకున్నట్టుగానే పర్యావరణం దక్కింది. దీంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా దక్కాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే గత జగన్ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా ఉండగా.. ఈసారి వన్ అండ్ ఓన్లీ పవన్ మాత్రమే. అంతే కాదు జనసేన, బీజేపీకి కూడా ప్రాధాన్యత ఉన్న శాఖలను చంద్రబాబు కేటాయించారు.
ఎవరికి ఏంటి..?
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్
పవన్ కల్యాణ్ : డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు
నారా లోకేష్ : మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు
అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ
నాదెండ్ల మనోహర్ : ఆహారం, పౌరసరఫరాల శాఖ
వంగలపూడి అనిత : హోం మంత్రిత్వ శాఖ
పొంగూరు నారాయణ : పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి
సత్యకుమార్ యాదవ్ : ఆరోగ్యశాఖ
నిమ్మల రామానాయుడు : నీటిపారుదల శాఖ
మహ్మద్ ఫరూఖ్ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ శాఖ
పయ్యావుల కేశవ్ : ఆర్థిక శాఖ
అనగాని సత్యప్రసాద్ : రెవెన్యూ శాఖ
కొలుసు పార్థసారథి: హౌసింగ్, I &PR శాఖలు
డోలా బాలవీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమ శాఖ
గొట్టిపాటి రవికుమార్ : విద్యుత్ శాఖ
కందుల దుర్గేష్ : పర్యాటకం, సాంస్కృతిక శాఖలు
గుమ్మడి సంధ్యారాణి : స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు
బీసీ జనార్థన్ : రహదారులు, భవనాల శాఖలు
టీజీ భరత్: పరిశ్రమల శాఖ
ఎస్.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖలు
వాసంశెట్టి సుభాష్ : కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్
కొండపల్లి శ్రీనివాస్ : MSME, సెర్ప్, NRI ఎంపర్‌పమెంట్ శాఖలు
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి: రవాణా, యువజన, క్రీడా శాఖలు