సీఎం గా తన ఛాంబర్ లో అడుగుపెట్టింది తడవు ఐదు ఫైల్స్ పై చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్స్ 4 వేలకి పెంచుతూ, అన్న క్యాంటీన్స్ ని రీ ఓపెన్ చేస్తూ చంద్రబాబు సంతకాలు పెట్టారు. ఇక చంద్రబాబు సీఎం గా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చెయ్యడమే కాదు.. సీనియర్స్ కి షాకిస్తూ కొంతమందిని మంత్రులుగా పేర్లని ప్రకటించారు.
అదులో ఎక్కువగా కొత్తగా ఎమ్యెల్యేలుగా ఎన్నికైన వారు, అలాగే యంగ్ ఎమ్యెల్యేలకి మంత్రులుగా చంద్రబాబు ఈసారి అవకాశం ఇచ్చారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న సీనియర్ నాయకులని చాలామందిని చంద్రబాబు పక్కనపెట్టేశారు. ముఖ్యంగా అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళని చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వకుండా పక్కనపెట్టడంతో టీడీపీ సీనియర్స్ చంద్రబాబు పై గుస్సాగా ఉన్నారని బ్లూ మీడియా రాతలు కోతలు మొదలెట్టింది.
కానీ అయ్యన్నపాత్రుడు మీడియాతో మట్లాడుతూ చంద్రబాబు కొత్తవాళ్ళకి మంత్రిగా అవకాశం ఇవ్వడం పట్ల సీనియర్స్ ఎవరికి కోపంగా లేదు.. నేను 25 ఏళ్లకే మంత్రిగా పదవి పొందాను. అప్పుడు సీనియర్స్ ఎవరు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు మేము అంతే. యువ ఎమ్యెల్యేలకి మంత్రులుగా అవకాశం ఇవ్వడం పట్ల సీనియర్స్ ఎవరు చంద్రబాబు పై అలగలేదు.. మేము ఎమ్యెల్యేలుగా మా పని చెయ్యడమే కాకుండా యువ మంత్రులకి సపోర్ట్ చేస్తాము అంటూ చెప్పడంతో బ్లూ మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.